స్థూలకాయులవుతున్న యువత
ఈ జీవనసరళిలో మార్పుల పర్యవసానంగా యువజనులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవలసి వస్తున్నది. సుదీర్ఘ కాలంగా ఉన్న మోకాలి, వెన్ను నొప్పుల నుంచి మధుమేహం వరకు, కొన్ని సందర్భాలలో గుండె సంబంధిత రుగ్మతలతో బాధపడవలసి వస్తున్నది. 20 ఏళ్ల ప్రాయంలోని వారే ఎక్కువగా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారని డాక్టర్లు అంగీకరిస్తున్నారు. 'తరచు మూత్ర విసర్జన చేయవలసిన అవసరం వస్తుండడంతోను, బలహీనత లక్షణాలు తరచు కనిపిస్తుండడంతోను ఒక 25 ఏళ్ల యువకుడు నా వద్దకు ఇటీవల వచ్చాడు. అతనిని క్షుణ్ణఁగా పరీక్షించగా అతనికి మధుమేహం వ్యాపించినట్లు వెల్లడైంది. బ్లడ్ షుగర్ స్థాయి 300గాను, బాడీ మాస్ ఇండెక్స్ (బిఎంఐ) 30 గాను నమోదయ్యాయి. ఆశ్చర్యమేమంట్ ఆ యువకుని కుటుంబంలో ఎవరూ మధుమేహ రోగులు కాకపోవడం' అని ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ రవి మెహ్రోత్రా తెలియజేశారు. 'వారు మా వద్దకు వచ్చిన తరువాత డైట్ వేళలను పాటించడం గాని, మందులను కచ్చితంగా సూచించిన వేళలలో వేసుకోవడం గాని చేయలేకపోతున్నారు' అని డాక్టర్ రవి చెప్పారు.
25 ఏళ్ల ప్రాయంలోని యువజనులు కూడా గుండె సంబంధిత సమస్యలతో బాధపడడం ఇప్పుడు పరిపాటి అయిందని సుప్రసిద్ధ హృద్రోగ వైద్య నిపుణుడు డాక్టర్ బి. సోమరాజు చెప్పారు. 'క్రితం వారం మా వద్దకు ఇద్దరు రోగులు వచ్చారు. వారిలో ఒకరి వయస్సు 25 కాగా రెండవవారి వయస్సు 28. ఇద్దరూ ఐటి ప్రొఫెషనల్సే. వారికి గుండెపోటు వచ్చింది. ఏంజియోప్లాస్టీ ద్వారా వారిలో ఒకరికి ప్రమాదాన్ని కొంత మేరకు మేము తగ్గించగలిగాం కాని రెండవ వ్యక్తి కొంత ఆలస్యంగా రావడం నష్టం ఎక్కువగా జరిగింది' అని ఆయన తెలిపారు.
సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ స్థూలకాయులయ్యే అవకాశం కొంత ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. 'మేము ఇప్పుడు దీనిని 'సాఫ్ట్ వేర్ సిండ్రోమ్'గా పేర్కొంటున్నాం. పని వేళలలో శారీరక కార్యకలాపాలు, వ్యాయామం వల్ల ఈ సమస్యను తగ్గించవచ్చు. యజమానులు కూడా ఆరోగ్య కర జీవితాలు సాగించేందుకు వారిని ప్రోత్సహించాలి' అని డాక్టర్ సోమరాజు సూచించారు.
Pages: -1- 2 News Posted: 26 October, 2009
|