త్వరలో ఒకే కాలుష్య సూత్రం
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) పర్యవేక్షిస్తున్న 342 ప్రాంతాలలో ఆర్ఎస్ పిఎం స్థాయి పారిశ్రామిక ప్రాంతాలలో అనుమతించినదాని కన్నా 78 శాతం, నివాస ప్రాంతాలలో 87 శాతం అధికంగా ఉంది. ఈ కొత్త సూత్రాల వల్ల పారిశ్రామికేతర ప్రాంతాలలో వర్తిస్తున్న పరిమితులే పారిశ్రామిక ప్రాంతాలకు నిర్దేశితమవుతాయి. 'పారిశ్రామిక వాడలు కాలుష్య నియంత్రణ టెక్నాలజీలపై పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది' అని మంత్రిత్వశాఖ అధికారి చెప్పారు.
'ఇది పెద్ద పారిశ్రామిక సంస్థల కన్నా చిన్న పారిశ్రామిక సంస్థలకే పెద్ద సవాల్' అని భారత పరిశ్రమల బృహత్ సమాఖ్య (సిఐఐ)లో ఇంధన, పర్యావరణ మార్పుల విభాగం అధిపతి సీమా అరోరా పేర్కొన్నారు. 'మన పెద్ద పరిశ్రమలలు ప్రపంచంలో అత్యంత పరిశుద్ధమైన సంస్థలతో సరిపోల్చదగినవి' అని ఆమె అన్నారు.
'పరిశుద్ధ టెక్నాలజీలను అనుసరించేందుకు చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలను అందజేయగలం' అని పారిశ్రామిక విధానం, ప్రచార విభాగం కార్యదర్శి అజయ్ శంకర్ తెలియజేశారు.
Pages: -1- 2 News Posted: 27 October, 2009
|