రోశయ్య డోలాయమానం
అయితే, ఈ పరిణామాల పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నవారు కూడా కొందరు లేకపోలేదు. 'రోశయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అధిష్ఠాన వర్గం సుస్పష్టం చేసింది. కచ్చితంగా వ్యవహరించవలసిన బాధ్యత ఇప్పుడు ఆయనదే. తాను చేయవలసినవి రోజూ అధిష్ఠానం చెప్పాలని ఆయన ఆశించజాలరు. ఆయన తన అధికారాన్ని ప్రదర్శించుకోవలసి ఉంటుంది. ఆయన అదే చేయలేకపోతున్నారు' అని అగ్ర శ్రేణి రాజకీయ విశ్లేషకుడు ఒకరు అభిప్రాయం వెలిబుచ్చారు. రోశయ్య అలా చేయలేకపోతుండడంతో (విధానాలను అమలు పరచవలసి ఉన్న) అధికార యంత్రాంగంలో ఆయన తన విలువను తగ్గించుకుంటున్నారని, ఆయన వత్తాసు పలకాలా లేదా అనేది వారు తేల్చుకోలేక పోతున్నారని, పర్యవసానంగా అధిష్ఠానానికి కూడా ఆయన ధోరణి విసుగు పుట్టించవచ్చునని ఆ విశ్లేషకుడు అన్నారు.
సరైన ప్రశ్నలు కొన్నిటిని జగన్ లేవనెత్తడం కూడా రోశయ్య భయాలకు కారణమై ఉండవచ్చునని విశ్లేషకులు అంటున్నారు. రానున్న వారాలలో జగన్ మరింత తీవ్ర స్థాయిలో ఈ అంశాలు లేవదీయవచ్చు. తన తండ్రి తలపెట్టిన సంక్షేమ పథకాలలో చాలావాటిని రోశయ్య ప్రభుత్వం అమలు పరచడం లేదని జగన్ పేర్కొన్నారు. అయితే, ఇది నిజమే. నిధుల కొరత కారణఁగా ఆరోగ్యశ్రీ కార్యక్రమం దాదాపుగా నిలచిపోయింది, పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ కార్యక్రమం అమలు కావడం లేదు, రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా విధానాన్ని ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు పెంచలేకపోతున్నారు. రానున్న మాసాలలో రాష్ట్ర ఆర్థిక వనరులు మరింతగా కుంచించుకుపోవచ్చు. ఆహార కొరత ఎదురుకావచ్చు. అప్పుడు పరిస్థితి మరింత అధ్వాన్నం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.
'ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న కాలంలో రాజశేఖరరెడ్డి సిఎంగా ఉన్నారని, అందుకే భూముల విక్రయాల ద్వారా ప్రభుత్వం ఏటా రూ. 1200 కోట్లు సమీకరించి, సంక్షేమ పథకాలకు మళ్ళించగలిగిందని రోశయ్య బాహాటంగా చెప్పజాలరు. మొత్తం జనాభా కన్నా రాష్ట్రంలో పేదల సంఖ్యను మరింతగా చూపడం ద్వారా కేంద్రం నుంచి తనకు నిజంగా రావలసిన నిధుల కన్నా రాష్ట్రం పొందడం లేదని కూడా ఆయన చెప్పలేరు. అయితే, ఈ మంచి కాలం ముగియవలసి ఉంటుంది. వైఎస్ఆర్ జీవించి ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులలో ఆయన ఇవే ఆర్థిక సమస్యలను ఎదుర్కొని ఉండేవారని కూడా ఆయన వాదించజాలరు' అని విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
Pages: -1- 2 News Posted: 27 October, 2009
|