టిఎన్-కేరళ చికెన్ పోరు
కేరళలోకి వచ్చే ప్రతి కిలో చికెన్ పై 12.5 శాతం ప్రవేశ పన్నును కేరళ ప్రభుత్వం విధించిన అనంతరం చెక్ పోస్టుల వద్ద కేరళ అధికారులతో లాలూచీ పడి పెద్ద ఎత్తున సుంకాన్ని ఎగవేయడం మొదలైందని అభిజ్ఞ వర్గాలు తెలియజేశాయి. ఆతరువాత ఈ పన్నును డిమాండ్ డ్రాఫ్టుల ద్వారా మాత్రమే చెల్లించాలని కొత్త నిబంధనను కేరళ ప్రభుత్వం ఆగస్టు 1న విధించింది. అయితే, చెక్ పోస్టుల వద్ద తమిళనాడుకు చెందిన సప్లయిర్లు సమర్పిస్తున్న డిమాండ్ డ్రాఫ్టులలో చాలా వరకు నకిలీవని, బ్యాంకులలో అందజేసినప్పుడు అవి చెల్లడం లేదని కేరళ అధికారులు తెలుసుకున్నారు.
'పే ఆర్డర్లను పోలి ఉండే విధంగా వారు చెక్కులలో మార్పులు చేశారు. ఫలితంగా రూ. 13 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది' అని కేరళ ఆర్థిక శాఖ మంత్రి థామస్ ఐజాక్ తెలియజేశారు. తమిళనాడులోని నీతిబాహ్యులైన సప్లయిర్లు కొందరు ప్రస్తుత పరిస్థితికి కారకులని ఆయన ఆరోపించారు. అవినీతిపరులైన వర్తకులను బ్లాక్ లిస్ట్ లో పెట్టామని, ఇప్పుడు కొత్త సప్లయిర్లను, ముఖ్యంగా చిన్న సంస్థలను నమోదు చేస్తున్నామని, వాటి దగ్గర నుంచి చికెన్లను తెప్పిస్తున్నామని ఐజాక్ తెలిపారు. 'నిజమే. చికెన్ ధరలు ఇప్పుడు బాగా పెరిగి ఉండవచ్చు. కాని ఇది తాత్కాలికమే. దిగుమతులపై త్వరలో ఆంక్షలు తొలగించాలని మేము యోచిస్తున్నాం' అని ఐజాక్ తెలిపారు.
Pages: -1- 2 News Posted: 29 October, 2009
|