ప్రతిభ... సుఖోయ్ విహారం అయితే, ఫైటర్ కాక్ పిట్ లో ప్రతిభా పాటిల్ సుఖంగా ఆశీనురాలయ్యేందుకు ఐఎఎఫ్ తగిన జాగ్రత్తలన్నీ తీసుకుంటుంది. యుద్ధ విన్యాసాలకు సుఖోయ్ పైలట్ స్వస్తి చెప్పి మాక్ 1 (గంటకు వెయ్యి కిలో మీటర్లకు పైగా) వేగంతో విమానాన్ని నడపడానికి పరిమితం కావచ్చు. సూపర్ సానిక్ జెట్లలో యుద్ధ విన్యాసాల వల్ల పైలట్లను గతి గురుత్వాకర్షణ శక్తి (జి-ఫోర్స్)కు ఎక్స్ పోజ్ చేస్తుంది. దీని వల్ల తల వరకు రక్తపు ఒత్తిడి తగ్గుతుంది. అత్యంత తీవ్ర పరిస్థితులలో జి-ఎల్ఒసి (గురుత్వాకర్షణ శక్తి వల్ల స్పృహ కోల్పోవడం) వంటి పరిణామానికి కూడా గురి కావచ్చు.
భారతదేశ క్షిపణి కార్యక్రమం పితగా గణుతికెక్కిన డాక్టర్ కలామ్ మొదటిసారిగా 2006 ఫిబ్రవరిలో ఒక కిలో-క్లాస్ జలాంతర్గామిలో ప్రయాణానికి ఉపక్రమించినప్పుడు అందరూ దిగ్భ్రాంతి చెందారు. ఆతరువాత 2006 జూన్ లో ఆయన సుఖోయ్ విమానంలో ప్రయాణించారు.కలామ్ అడుగుజాడలలో నడుస్తున్నట్లుగా ప్రతిభా పాటిల్ ఇలా సుఖోయ్ లో ఎగరాలనుకోవడం ప్రచారపు ఎత్తుగడగా చాలా మంది పరిగణించవచ్చు. కాని ప్రప్రథమ మహిళా 'సర్వ సైనికాధికారి' అయిన ప్రతిభా పాటిల్ ఐఎఎఫ్ లో మహిళా ఫైటర్ పైలట్లను అనుమతించవలసిన సమయం ఆసన్నమైందని రక్షణ యంత్రాంగానికి ఈ విధంగా సంకేతం కూడా పంపవచ్చు.
సైనిక దళాలలో ఆఫీసర్లుగా మహిళలను చేర్చుకోవడం 1990 దశకం ప్రారంభం నుంచి జరుగుతున్నప్పటికీ ఆర్మీలో 35 వేల ఆఫీసర్లలో కేవలం వెయ్యి మందికి పైగా మహిళలు, ఐఎఎఫ్ లో 10,500 మంది ఆఫీసర్లలో సుమారు 750 మంది మహిళలు, నౌకా దళంలో 7000 మంది ఆఫీసర్లలో సుమారు 180 మంది మహిళలు ఉన్నారు.
ప్రస్తుతం ఐఎఎఫ్ లో 60 మంది మహిళా పైలట్లు ఉన్నారు. వారు రవాణా విమానాలను, హెలికాప్టర్లనే తప్ప యుద్ధ విమానాలను నడపడం లేదు. అదేవిధంగా నౌకాదళంలో యుద్ధ నౌకలలోను, సైన్యంలో యుద్ధానికి వెళ్ళే పదాతిదళం (ఇన్ ఫెంట్రీ), శతఘ్ని దళం, ఆర్మర్డ్ కోర్ వంటి విభాగాలలో మహిళలు లేరు. యుద్ధ విమానాలలో లేదా పదాతి దళంలో లేదా యుద్ధ నౌకలలో మహిళలను అనుమతించడానికి 'నిర్వహణ పరమైన, ఆచరణపరమైన, సంస్కృతిపరమైన సమస్యలు' ఉన్నాయని ఉన్నత స్థాయి సైనికాధికారులు చెబుతున్నారు.అంతే కాకుండా వారు గరిష్ఠంగా 14 సంవత్సరాల పాటు మాత్రమే పని చేయగలరు. సైనిక దళాలలో లీగల్, విద్యా విభాగాలలో మహిళలకు శాశ్వత కమిషన్ కు ప్రభుత్వం ఈమధ్యే అంగీకరించింది.
Pages: -1- 2 News Posted: 30 October, 2009
|