మౌనంగానే వైఎస్ మృతి దేశంలో హెలికాప్టర్ దుర్ఘటనపై అత్యంత తీవ్ర స్థాయిలో నిర్వహిస్తున్న దర్యాప్తులలో ఈ కేసుదే అగ్ర స్థానం. ఈ దర్యాప్తు ఈ నెలాఖరులోగా పూర్తి కావచ్చు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎటిసి) సమాచారం ప్రకారం, ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో గరిష్ఠంగా 2.45 గంటల ప్రయాణానికి సరిపోయే ఇంధనం ఉంది. ఉదయం 8.38 గంటలకు టేకాఫ్ అయిన తరువాత 35 నిమిషాల సేపు అంటే 9.13 గంటల వరకు హెలికాప్టర్ హైదరాబాద్ రాడార్ తో సంబంధాలు కలిగి ఉంది. ఆ సమయంలో అది హైదరాబాద్ కు దాదాపు 150 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఉదయం 9.13 గంటలకు చెన్నై రాడార్ తో హెలికాప్టర్ కు సంబంధాలు ఏర్పడవలసి ఉంది. అయితే, సరిగ్గా అదే సమయంలో దానికి సంబంధాలు తెగిపోయాయి.
వైఎస్ఆర్ హెలికాప్టర్ దుర్ఘటనపై దర్యాప్తు జరుపుతున్న స్వతంత్ర బృందం 'సాలిడ్ స్టేట్' సివిఆర్ ను ముందుగా హెలికాప్టర్ తయారీ సంస్థ అమెరికాలోని బెల్ కు పంపింది. ట్యాంకింగ్, వాయు ప్రవాహాన్ని నియంత్రించే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ల నుంచి సమాచారాన్ని కూడా అధ్యయనం చేశారు. ఈ విశ్లేషణ కోసం బెల్ బృందం ఒకటి ఇండియాకు వచ్చింది. క్రితం నెల దర్యాప్తు అధికారులతో మరొక బృందాన్ని మొత్తం డేటాను విశ్లేషించి, మరింత సమాచారాన్ని రాబట్టడానికై అమెరికన్ జాతీయ రవాణా భద్రతా మండలి (ఎఎన్ టిఎస్ బి) వద్దకు పంపారు.
విశేష అనుభవం ఉన్న కెప్టెన్ ఎస్.కె. భాటియా, కో-పైలట్ ఎం.ఎస్. రెడ్డి నడుపుతున్న ప్రభుత్వ యాజమాన్యంలోని హెలికాప్టర్ (విటి-ఎపిజి) పతనానికి ముందు చివరి క్షణాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి దర్యాప్తు బృందం ప్రయత్నిస్తున్నది. 5600 గంటలకు పైగా విమానాలు నడిపిన అనుభవం ఉన్న భాటియాను 2007 జూన్ లో బెల్ 430 తరహా హెలికాప్టర్ ను నడిపేందుకు యోగ్యుడిగా ప్రకటించారు. ఇక 3200 గంటలు విమానాలు నడిపిన అనుభవం ఉన్న రెడ్డిని ఈ తరహా హెలికాప్టర్ ను నడిపేందుకు యోగ్యుడిగా ఈ సంవత్సరం జనవరిలో ప్రకటించారు.
హెలికాప్టర్ శిథిలాలు నిర్దేశిత మార్గానికి చాలా దూరంగా కనిపించాయి. అంటే హెలికాప్టర్ మార్గం మళ్ళిన విషయాన్ని అందులో ఉన్నవారు ఎవరూ గ్రహించలేదన్న మాట. హెలికాప్టర్ పతనమై 24 గంటలు దాటిన తరువాత శిథిలాలు కనిపించాయి. వైఎస్ఆర్ ఉదయం 8.38 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరారు. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఉదయం 9.35 గంటలకు నల్లమల అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ అదృశ్యమైంది. కర్నూలుకు తూర్పుగా 40 నాటికల్ మైళ్ళ దూరంలో రుద్రకొండ గుట్టపై శిథిలాలు కనిపించాయి. హెలికాప్టర్ కు నిర్దేశించిన ప్రయాణ మార్గంలో లేని ప్రదేశం అది. బలమైన గాలులు, విధి ఈ దుర్ఘటనకు కారణమయ్యాయి.
Pages: -1- 2 News Posted: 2 November, 2009
|