మహేంద్రగిరికి మావోలు? అబూజ్ మడ్ లో మావోయిస్టులపై ముప్పేట దాడులకు ప్రభుత్వ బలగాలు సిద్దమవుతున్న తరుణంలో మావో నేతలు మహేంద్రగిరి ప్రాంతానికి వస్తున్నారు. ఇందులో నంబాల కేశవరావు మిలిషియాకు చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. యుద్ధ తంత్రంలో కూడా ఆరితేరిన నంబాలకు ఈ ప్రాంతాలన్నీ కొట్టినపిండే. వీరితోపాటు మరికొందరు ముఖ్య నాయకులుకూడా ఎఓబీలో ఉంటూ కాడర్ ను బలోపేతం చేయడం, పార్టీ కార్యక్రమాలను ముమ్మరం చేయడం వంటి చర్యలకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
అలాగే ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణల్లో కూడా మావోయిస్టుల కదలికలు ఎక్కువవుతున్నట్లు పోలీసులు నిర్ధారిస్తున్నారు. ప్రధానంగా చత్తీస్ గఢ్, మహారాష్ట్రలకు అతి సమీపంలో ఉన్న కరీంనగర్ జిల్లాలో మావోయిస్టులు పేట్రేగిపోయేందుకు సన్నద్ధమవుతున్నట్లు భావిస్తున్నారు. అబూజ్ మాడ్ లో మావోయిస్టులను ఏరివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా, అక్కడివారు ఇప్పటికే కరీంనగర్, వరంగల్ వంటి జిల్లాలకు వలస వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టులు కొంతమందిని ఇన్ ఫార్మర్ నెపంతో హతమార్చడంతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు. అగ్రనేతలే స్వయంగా ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దులో బసచేయడంతో ఆ కమిటీ పరిధిలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, దండకారణ్యం పరిధిలోకి వచ్చే విశాఖ జిల్లాల్లో మావోయిస్టులు తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 2 November, 2009
|