సుష్మా 'మాతే' గతి! రెడ్డి సోదరులు, వారి మద్దతుదారులు సోమవారం ఉదయం ఢిల్లీలో అరుణ్ జైట్లీని, అనంత కుమార్ ను కలుసుకుని యెడ్యూరప్ప కొనసాగిన పక్షంలో ఆయన సభలో తన 'మెజారిటీ'ని కోల్పోగలరని స్పష్టం చేశారు. అయితే, మూడు కారణాలపై యెడ్యూరప్పకు అది ఏమాత్రం కలవరం కలిగించదు. వాటిలో ఒకటి - ఆయన సంఖ్యాధిక్యం తగ్గినప్పటికీ ప్రతిపక్షం బలం మాత్రం పెరగజాలదు. ఫిరాయింపు నిరోధక చట్టం వల్ల తిరుగుబాటు ఎంఎల్ఎలు తమ సీట్లు కోల్పోగలరు. రెండవది - తన కుమారుడు హెచ్.డి. రేవణ్ణను ఉప ముఖ్యమంత్రిని చేసేటట్లయితే జనతా దళ్ (సెక్యులర్) నేత హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వాన్ని కాపాడడానికి సుముఖంగా ఉండవచ్చు. మూడవది - ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే ప్రయత్నించకపోవచ్చు.
గౌడతో చర్చలు ఇంకా 'ప్రాథమిక' దశలోనే ఉన్నాయని యెడ్యూరప్ప శిబిరంలోని వారు స్పష్టం చేశారు. రెండు సంవత్సరాల క్రితం సంకీర్ణం భగ్నమైన తరువాత దేవెగౌడను విశ్వసించేందుకు బిజెపిలో చాలా మంది సిద్ధంగా లేరు. 'రెడ్డి సోదరుల పట్ల గౌడ, యెడ్యూరప్పు ఇద్దరికీ ఒకేవిధమైన వ్యతిరేకత ఉంది. వారి యత్నాలు జయప్రదం కాకుండా చూసేందుకు గౌడ ఏ పనైనా చేయగలరు' అని బిజెపి ప్రతినిధి ఒకరు చెప్పారు. తమ ఎంఎల్ఎలను, ఎంపిలను బిజెపిలో చేరేట్లుచేసన రెడ్డి సోదరులపై కాంగ్రెస్ కు ఏమాత్రం సదభిప్రాయం లేదు.
Pages: -1- 2 News Posted: 2 November, 2009
|