రామదేవ్ - 'అల్లా' యోగా రామదేవ్ కు, దేవ్ బండ్ కు మధ్య మైత్రికి దోహదం చేసింది యోగా. దీనితో భారతీయ ముస్లింలలో అధిక సంఖ్యాకులకు యోగ నేర్పేందుకు ఆయనకు వీలు కలిగింది. ముస్లింల యోగాభ్యాసా్ని మలేషియన్ మౌలానాలు క్రితం సంవత్సరం నిషేధించిన అనంతరం 'ఓమ్' అనకుండానే 'అల్లా' అని కూడా అంటూనే యోగాసనాలను ముస్లింలు వేయవచ్చునని సూచించడం ద్వారా రామదేవ్ ముస్లింల అభిమానాన్ని చూరగొన్నారు..
ముస్లింలు యోగాసనాలు వేయడంలో తప్పేమీ లేదని దారుల్ ఉలూమ్ బాబా రామదేవ్ పర్యటనకు కొన్ని రోజుల ముందు ప్రకటించింది. 'ఓమ్' అని ఉచ్చరించకుండానే తాను స్వయంగా యోగాభ్యాసం చేసానని జమియాత్ అధిపతి మౌలానా మహ్మూద్ మాద్ని చెప్పారు. 'తమ శరీర నిర్మాణానికి దోహదం చేసే పని నుంచి ముస్లింలను ఎందుకు దూరంగా ఉంచాలి' అని దారుల్ ఉపాధ్యక్షుడు మౌలానా అబ్దుల్ ఖలీక్ మదరాసీ అన్నారు. 'ఇది ముస్లింలకు మింగుడుపడని విషయమేమీ కాదు. యోగాకు సమానమైన విన్యాసాలు సూఫీ సంస్థలలో కనిపిస్తాయి' అని జమియాత్ అధికార ప్రతినిధి మౌలానా అబ్దుల్ హమీద్ నోమాని పేర్కొన్నారు. హరిద్వార్ లోని రామదేవ్ కు చెందిన పతంజలి యోగపీఠ్ 'అల్లా' లేదా 'గాడ్' అని ఉచ్ఛరిస్తూ తమ యోగాభ్యాసాన్ని ప్రారంబించవచ్చునని తన క్రైస్తవ, ముస్లిం శిష్యులను కోరింది.
Pages: -1- 2 News Posted: 4 November, 2009
|