ఉప్పల్ లో చరిత్ర మారేనా? ఇక ఆస్ట్రేలియాది విచిత్రమైన పరిస్థితి. తుది 11 మంది ఆటగాళ్లలో ఎవరు బరిలోకి దిగుతారో అని చెప్పలేని దుస్థితి ఆ జట్టుకు ఏర్పడింది. ప్రతి మ్యా చ్‌కు ముందు ఓ కీలక ఆటగాడు గాయంతో వైదొలుగుతున్నాడు. తాజాగా ఫాస్ట్‌బౌలర్లు పీటర్‌సిడిల్, హెన్రిక్స్‌లు గాయంతో ఇంటిదారి పట్టారు. ఆటగాల్లు వరుసగా గాయపడటం జట్టుపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఐతే మొహాలీలో ఆల్‌రౌండ్‌నైపుణ్యంతో రాణించి భారత్ జోరుకు బ్రేక్ వేసి పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసంతో ఆసీస్ బరిలోకి దిగుతోంది. ఆల్‌రౌండర్ వాట్సన్ టచ్‌లోకి రావడంతో జట్టు సంతోషంగా ఉంది.
నాలుగోవన్డేలో బ్యాటింగ్, బౌలింగ్‌లో వాట్సన్ రాణించాడు. ఇక కెప్టెన్ పాంటింగ్‌తో పాటు మిడిలార్డర్‌లో మైక్‌హస్సీలు సిరీస్‌లో నిలకడగా రాణిస్తున్నారు. వైట్ కూడా గాడిలో పడ్డాడు. ఐతే బౌలింగ్ కష్టాలు మాత్రం మరింత ఎక్కువైయ్యాయి. బ్రెట్ లీ, హోప్స్, సిడిల్, హెన్రిక్స్‌లు గాయపడ్డారు. దాంతో బొలింగర్, జాన్సన్‌లే బౌలింగ్ భారం మోయనున్నారు. కొత్తగా జట్టులోకి వచ్చిన న్యూసౌత్‌వేల్స్ ఆటగాడు క్లింట్ మెక్ కీ వన్డే ఆరంగ్రేటం చేసే అవకాశం ఉంది. వోగ్స్, హిల్ఫొనాస్‌లు తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియా బౌలింగ్ ఇబ్బం దులు భారత బ్యాట్స్‌మెన్ సద్వినియోగం చేసుకొగలిగితే సిరీస్‌పై పట్టు సాధించవచ్చు.
భారత్: ధోనీ (కెప్టెన్), సెహ్వాగ్, సచిన్, గంభీర్, యువరాజ్, సురేష్ రైనా, హర్భజన్‌సింగ్, ఇషాంత్, విరాట్ కోహ్లీ, అశీష్‌నెహ్రా, ప్రవీణ్, రవీంద్ర జడేజా.
ఆస్ట్రేలియా: పాంటింగ్ (కెప్టెన్), మైక్ హస్సీ, హారిట్జ్, హిల్ఫోనాస్, షాన్ మార్ష్, హెన్రిక్స్, మనౌ, అడమ్ వోగ్స్, షేన్ వాట్సన్, వైట్, క్లీంట్ మెక్ కీ, మిచెల్ జాన్సన్, హిల్ఫోనాస్, బొలింగర్.
Pages: -1- 2 News Posted: 4 November, 2009
|