కోట్ల డాలర్లతో చలి మంట! అతనికి పెక్కు మాన్షన్లు, విమానాలు, ఒక ప్రైవేట్ జూ, సొంత సైన్యం ఉండేవి. అతని అదుపాజ్ఞలలో కరడుగట్టిన నేరస్థులు కూడా ఉండేవారు. ఎస్కోబార్ అనేక బిలియన్ల డాలర్లు ఆర్జించాడు, వందలాది, లేకపోతే వేలాది హత్యలు చేయించాడు. అయితే, అదే సమయంలో అతను పాఠశాలలు, స్టేడియంలు, చర్చీలపైన, చివరకు పేదల గృహవసతిపైన పెక్కు మిలియన్ల డాలర్లు ఖర్చు చేసినట్లు తెలుస్తున్నది.
అయితే, 1993లో అమెరికన్ టెక్నాలజీని ఉపయోగించి కొలంబియన్ భద్రతా దళాలు మెడెలిన్ మధ్యతరగతి వర్గాల నివాస ప్రాంతంలోని ఒక ఇంటిలో దాక్కున్న ఎస్కోబార్ ను కనుగొన్నారు. పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు అతనిని కాల్చి చంపారు. అతని సోదరుడు రాబర్టో ఎస్కోబార్ రాసిన గ్రంథం 'ది అకౌంటెంట్స్ స్టోరీ' ప్రకారం, కొకెయిన్ వ్యాపారంలోకి దిగే ముందు ఎస్కోబార్ చాలా కాలంగా ఎవరూ పట్టించుకోని శ్మశానవాటికలలోని పాత సమాధి రాళ్ళను అమ్మే, తిరిగి ఉపయోగించే వ్యాపారం నిర్వహించాడు.
Pages: -1- 2 News Posted: 5 November, 2009
|