సిఎంలు ఏమయ్యారు? మావోయిస్టుల బెడద ఎక్కువగా ఉన్న గిరిజన ప్రాంతం పశ్చిమ మిడ్నపూర్ లో వారాంతపు సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్ల సమీక్షలో బెంగాల్ ముఖ్యమంత్రి బుధవారం నిమగ్నమయ్యారు. సంక్షేమ కార్యక్రమాలను, శాంతి భద్రతల పరిస్థితిని బుద్ధదేవ్ భట్టాచార్జీ ఈ సమావేశాలలో సమీక్షిస్తారు. 'ఇందుకు విస్తృతమైన హోమ్ వర్క్ అవసరం. ఆరాంబాగ్ లో పరిస్థితిపై కూడా ఒక కన్ను వేసి ఉంచేందుకు ముఖ్యమంత్రి కోలకతాలో ఉండాలనుకున్నారు. ఆరాంబాగ్ సమీపంలోని ఖానాకుల్ లో సంఘర్షణలు జరిగిన అనంతరం మమతా బెనర్జీ బుధవారం ఆరాంబాగ్ లో ఒక సమావేశం నిర్వహించారు' అని కోలకతాలో ఒక అధికారి తెలియజేశారు.
న్యూఢిల్లీ సదస్సుకు బెంగాల్ నుంచి అటవీ శాఖ మంత్రి అనంతరాయ్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి జోగేష్ బర్మన్, ఆయన శాఖ కార్యదర్శి నూరుల్ హక్ హాజరయ్యారు. 'ఇతర కార్యక్రమాలతో తీరిక లేనందున ముఖ్యమంత్రి రాలేకపోయారు' అని రాయ్ చెప్పారు. 'ఇద్దరు మంత్రులు వెళ్లారు. ఈ కార్యక్రమానికి ప్రాముఖ్యం ఇచ్చామనేందుకు అది చాలు. అయినా, ప్రతి కార్యక్రమానికి ముఖ్యమంత్రిని లేదా ప్రధాన కార్యదర్శిని ఆహ్వానించడం ఢిల్లీకి పరిపాటి. అటువంటి విజ్ఞప్తులకు అంగీకరించడం ప్రతిసారి సాధ్యం కాదు కదా' అని బెంగాల్ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
ఇంతకుముందు కూడా బుద్ధదేవ్ భట్టాచార్జీ మావోయిస్టుల సమస్యపై ఢిల్లీలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాలేదు. భట్టాచార్జీకి ఆరోగ్యం బాగుండలేదని ఆయన సెక్రటేరియట్ తెలియజేసింది. మావోయిస్టుల బెడద పెచ్చుమీరుతున్న నేపథ్యంలోను, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించే ముందు భద్రత సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉన్న దృష్ట్యాను ఈ గిరిజన సంక్షేమ సదస్సు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది.
ప్రధాని సదస్సును ప్రారంభిస్తూ, ఆధునిక ఆర్థిక కార్యక్రమాలలో గిరిజనులకు భాగస్వామ్యం కల్పించడంలో 'వ్యవస్థాగత వైఫల్యం' ఉందని అన్నారు. దశాబ్దాలుగా ఈ దూరం పెరిగిపోతున్నదని, ఇది దేశంలోని కొన్ని ప్రాంతాలలో విషమ రూపు దాలుస్తున్నదని ఆయన పేర్కొన్నారు. అయితే, 'తుపాకీల నీడలో ఏ కార్యక్రమాలనైనా అమలు జరపడం' సాధ్యం కాదని డాక్టర్ మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు.
Pages: -1- 2 News Posted: 5 November, 2009
|