మళ్లీ ఇవిఎంల గోల
నాసిక్ తూర్పు నియోజకవర్గంలో వివిధ డివిజన్లలో ఎంఎన్ఎస్ అభ్యర్థికి అసాధారణ సంఖ్యలో వోట్లు పడ్డాయని, ఎంఎన్ఎస్ అభ్యర్థికి వచ్చినన్ని వోట్లలో సగం కూడా సిట్టింగ్ మెంబర్ కు రాలేదని ఈ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి శోభా బచ్చవ్ భర్త దినేష్ బచ్చవ్ ఆరోపించారు. నాసిక్ లోని మూడు సీట్లలో ఎంఎన్ఎస్ విజయం సాధించడం అనుమానాలను రేకెత్తించిందని, ఈ మూడు సీట్లలో విజేతల ఆధిక్యం సుమారు 25 వేల నుంచి 30 వేల వోట్ల వరకు, 41 శాతం వోట్ల వరకు ఉందని కూడా ఆయన ఆరోపించారు. అశోక చవాన్ ప్రభుత్వంలో శోభ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు.
నాసిక్ సెంట్రల నియోజకవర్గంలో శివసేన అభ్యర్థి సునీల్ బగుల్ సోదరుడు సంజయ్ బగుల్ మాట్లాడుతూ, ఇవిఎంలలో అక్రమంగా మార్పులు చేశారని పార్టీ అనుమానిస్తున్నదని, ఎందుకంటే ఇతరుల కన్నా ఎక్కువ వోట్లు రాగలవని తమకు ధీమా ఉన్న ప్రాంతాలు కొన్ని ఉన్నాయని, కాని అక్కడ ఆవిధంగా వోట్లు రాలేదని చెప్పారు. 'గంగాపూర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అత్యధికంగా ఉన్న ప్రాంతంగా పేరు పడింది. శివసేన - బిజెపి కూటమికి ఆర్ఎస్ఎస్ వోటు వేస్తుందని ప్రతి ఒక్కరికీ తెలుసు. కాని ఆ ప్రాంతంలో ఎంఎన్ఎస్ అభ్యర్థికి 3000 వోట్లు రాగా, శివసేన అభ్యర్థికి వెయ్యి వోట్లు మాత్రమే లభించాయి' అని సంజయ్ బగుల్ వివరించారు.
లాతూర్ లో బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి) అభ్యర్థి ఖయ్యూం ఖాన్ బంధువైన ముర్తుజా ఖాన్ మాట్లాడుతూ, తమ స్థానిక డివిజన్ లో 142 వోట్లకు 60 వోట్లు ఖయ్యూంకు లభించాయని చెప్పారు. తాము బిఎస్ పికి వోట్లు వేశామని కనీసం 500 మందైనా కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు. 'ఆ ప్రాంతంలో బిఎస్ పి అభ్యర్థికి బలం ఎక్కువ ఉన్న స్థితిలో 60 వేలకు పైగా వోట్ల తేడా రాకూడదు' అని ముర్తుజా పేర్కొన్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ కమారుడు అమిత్ దేశ్ ముఖ్ లాతూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి.
ఈ దుష్ప్రచారాన్ని నిలిపివేయాలని కోరుతూ తమ ఇంజనీర్లకు ఇసిఐఎల్ లీగల్ నోటీసులు పంపిందని హరిప్రసాద్ తెలియజేశారు. ఇవిఎంలో ఏవిధంగా అక్రమాలకు పాల్పడవచ్చునో చూపవలసిందిగా ఆతరువాత నెట్ ఇండియాను ఇసిఐఎల్ సెప్టెంబర్ 3న ఆహ్వానించిందని ఆయన తెలిపారు. కాని మధ్యలోనే ఇసిఐఎల్ తమను ఆపివేసిందని, మూడు రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తయిన తరువాత మెషీన్ ను ఇవ్వగలమని ఇసిఐఎల్ చెప్పిందని, కాని ఇంతవరకు అలా చేయలేదని హరిప్రసాద్ తెలిపారు.
Pages: -1- 2 News Posted: 7 November, 2009
|