బోర్డు తిప్పిన ఓజ్ కాలేజీలు
'ఈ వ్యవస్థలో అక్రమాలు, వంచనలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి' అని ఆయన చెప్పారు. విదేశీ విద్యార్థులలో తిరిగి విశ్వాసం నింపడానికి ఆస్ట్రేలియా విద్యా వ్యవస్థలో ప్రస్తుతం పెను మార్పులు తీసుకువస్తున్నారని, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి రెండు సంవత్సరాలు పట్టవచ్చునని శర్మ పేర్కొన్నారు.
కాగా, ప్రైవేట్ కళాశాలలపై మరింతగా నియంత్రణ ఉండాలని ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ యూనియన్ (ఎఇయు) సూచించింది. 'కుప్పకూలుతున్న ప్రైవేట్ కాలేజీల సంఖ్య పెరిగిపోతున్నది. ఇందుకు మూల్యం చెల్లించుకుంటున్నది విద్యార్థులే' అని యూనియన్ అధ్యక్షుడు ఏంజెలో గావ్రైలాటోస్ అన్నారు. 'కాలేజీలు ఆర్థిక స్తోమత కలిగి ఉండేట్లు, అంతర్జాతీయ, దేశీయ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేట్లు చూసేందుకు కొత్త కాలేజీలపైన, ఇప్పుడున్న కాలేజీలపైన తగినంతగా పర్యవేక్షణ జరగడం లేదు' అని ఏంజెలో వ్యాఖ్యానించారు.
Pages: -1- 2 News Posted: 7 November, 2009
|