అనార్కలీ...జస్ట్ లక్షే! అయితే, ఆర్థిక మాంద్యం, లే ఆఫ్ ల ప్రభావానికి గురైన నగరంలో అనార్కలి గురించి ఆసక్తి కలిగిందే తప్ప దానికి డిమాండ్ పెరగలేదు. అనార్కలి బటర్ చికెన్ అమ్మకాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ ప్రకారం అక్టోబర్ లో బటర్ చికెన్ బట్వాడా జరిగింది. ఈ నెలలో దాని కోసం నాలుగు ఆర్డర్లు వచ్చాయి. అయితే, దాని కోసం ఆర్డర్ చేసిన వ్యక్తి పేరు వెల్లడికి సక్సేనా నిరాకరించారు. కస్టమర్ పేరును గోప్యంగా ఉంచాలన్న సంస్థ విధానానికి అనుగుణంగానే ఆ వ్యక్తి పేరును చెప్పడానికి సక్సేనా ఇష్టపడలేదు.
'ఫేస్ బుక్, గూగుల్ లో మేము చేసిన ప్రచారం, ఇచ్చిన వాణిజ్య ప్రకటనల ద్వారానే బుకింగ్ లు వచ్చాయి' అని ప్రాజెక్టు సహ వ్యవస్థాపకులు, పద్మా ప్రసాద్ తెలియజేశారు. ఎంబిఎ అయిన పద్మా ప్రసాద్ దీనికి సంబంధించిన మొత్తం వ్యవహారాలన్నీ చూస్తుంటారు. మరి ఈ ధర కస్టమర్లకు షాక్ ఇవ్వడం లేదా?
అనార్కలి బృందం ఈ ధరను, దీనికి సంబంధించిన చారిటీ లక్ష్యాన్ని సమర్థిస్తున్నారు. 'ఇండియాలో నాణ్యతకు, మంచి పనికి ఎంతైనా వెచ్చించడానికి జనం సిద్ధంగా ఉంటారు' అని సక్సేనా చెప్పారు. 'ఈ బటర్ చికెన్ తయారీకి మేము వాడే విడి పదార్థాలన్నిటి జాబితాను, తయారీ వివరాలను మేము మా వెబ్ సైట్ లో పొందుపరిచాం. కాని మా కాపీరైట్ రక్షణ కోసం ఏ దినుసులు ఎంత పరిమాణంలో వాడాలన్నది మాత్రం తెలియజేయలేదు' అని ఆయన పేర్కొన్నారు.
అయితే, బటర్ చికెన్ ప్రయోగం సక్సేనా చేదు నిజాన్ని గ్రహించేట్లు చేసింది. 'ఏదైనా కొత్త పని చేయాలనుకోగానే సరిపోదు. అది అపోహలకు కూడా దారి తీస్తుందని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాను' అని సక్సేనా తన వెబ్ సైట్ లో పేర్కొన్నారు. తాను డబ్బు సంపాదించడం కోసమే ఈ వ్యాపారం ప్రారంభించానని కొందరు భావిస్తున్నట్లున్నదని ఆయన పేర్కొన్నారు. వారి అభిప్రాయం తప్పని నిరూపించేందుకు అనార్కలి బటర్ చికెన్ ను డిసెంబర్ 1 వరకు మాత్రమే విక్రయించనున్నట్లు, ఆతరువాత దీనిని ధర్మ కార్యాల కోసమే తయారు చేయనున్నట్లు సక్సేనా తెలియజేశారు.
ఈ చికెన్ ను తినాలని కోరుకునేవారు దీని ధరను అక్షయ పాత్ర ఫౌండేషన్ కు చెల్లించవలసి ఉంటుంది.
మరి ఆ ధర ఎంత? ఒక లక్ష రూపాయలే. నలుగురికి. (పేదలకు ఉచిత భోజన సౌకర్యం కలిగించే సంస్థ అక్షయ పాత్ర ఫౌండేషన్.)
Pages: -1- 2 News Posted: 9 November, 2009
|