గూగుల్ తో 'కోడా' డీకోడ్ ఈ కేసులో దర్యాప్తు కోసం హవాలాతో సహా అక్రమ లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించడం కోసం ఐటి శాఖ బృందం ఒకటి ఆదివారం ముంబై వెళ్ళింది. రూ. 2500 కోట్ల మేరకు అక్రమ లావాదేవీలు ముంబై నుంచి ప్రధానంగా జరిగాయి. వాటిలో రూ. 500 కోట్లను దుబాయి, థాయిలాండ్, మలేషియా, దక్షిణాఫ్రికా, లైబీరియా, తదితర ప్రదేశాలకు పంపారు. తమ శాఖ చేపట్టిన ఒక కేసులో దర్యాప్తు అధిక సంఖ్యలో దాడులకు దారి తీసినట్లు ఐటి అధికారులు తెలియజేశారు. అక్టోబర్ 31 నుంచి దాదాపు వారం రోజుల పాటు ఐటి శాఖ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అధికారులు ఎనిమిది భారతీయ నగరాలలో 76 చోట్ల దాడులు నిర్వహించారు. ఇంతకుముందు ఇలా అధిక సంఖ్యలో 55 చోట్ల దాడులు జరిగాయి.
'ఇదేదో మామూలు దాడి కాదు. మేము నిర్వహించిన అతి పెద్ద దాడి. మేము స్వాధీనం చేసుకున్న పత్రాలు, మేము సమీకరిస్తున్న సమాచారం ద్వారా కోడా, ఆయన సహచరుల సామ్రాజ్యం పలు భారతీయ నగరాలకు, కనీసం ఆరు విదేశాలకు విస్తరించింది' అని ఐటి శాఖ అధికారి ఒకరు తెలియజేశారు.
ఇది ఇలా ఉండగా, ఐటి., ఇడి అధికారుల బృందం మధు కోడాను రాంచిలోని ఆయన అధికార నివాసంలో కలుసుకున్నది. కోడా సహచరుడుగా భావిస్తున్న, ఇంటరాగేట్ చేసే నిమిత్తం ఐటి అధికారుల ముందు నవంబర్ 6న హాజరు కావలసిందని కోరిన దేవేంద్ర ముఖియా తన పన్ను రిటర్న్ లతో పాటు ఐటి అధికారుల ముందు హాజరయ్యాడు. ముఖియాను వారు ఇంటరాగేట్ చేశారు. నవంబర్ 6న తమ ముందు హాజరు కాకపోవడంతో ఐటి శాఖ నుంచి 'గాలింపు' నోటీసు జారీ అయిన ఆరుగురు వ్యక్తులలో ముఖియా ఒకరు. మిగిలినవారు వినోద్ సిన్హా, సంజయ్ కుమార్ చౌదరి, బసంత్ భట్టాచార్య, మనోజ్ పునమియా, అనిల్ బస్తవడే. వారిలో ఎవ్వరూ దేశం విడిచి వెళ్ళకుండా చూసేందుకు దేశంలోని అన్ని విమానాశ్రయాలలో ఇమ్మిగ్రేషన్ అలర్ట్ జారీ చేశారు.
Pages: -1- 2 News Posted: 10 November, 2009
|