'సెల్లు' చెవులకు చిల్లు మరో ప్రముఖ వైద్య నిపుణుడు ఎన్ స్వరూప్ రెడ్డి మాట్లాడుతూ, 20 ఏళ్ళు పైబడిన యువత, నడివయసు గల వ్యక్తులు తమ దగ్గరకు ఎక్కువగా వస్తున్నారని చెప్పారు. తన దగ్గరకు వచ్చిన ఒక 50 ఏళ్ళ వ్యక్తి అనుభవాన్ని ఆయన వెల్లడించారు. ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ డైరెక్టర్ ఒకరు చెవుల్లో పోటు, మోత వంటి ఇబ్బందులతో రాగా, వారం పాటు సెల్ కు దూరంగా ఉండాలని ఆయనకు సూచించారు. వారం తర్వాత తన పరిస్థితి మెరుగుపడిందని ఆ డైరెక్టర్ తనకు తెలియజేశారని వివరించారు.
శ్రవణ పరమైన ఇబ్బందులు రావడానికి పలు కారణాలను డాక్టర్ టీవీ కృష్ణారావు వెల్లడించారు. సెల్ ఫోన్ ను చెవులకు దగ్గరకు పెట్టుకోవడంతో చెవులు దిబ్బెత్తి పోతున్నాయన్నారు. ఇదంతా శాస్త్రీయంగా ఇంకా రుజువు కాలేదు. కానీ, పలువురి అనుభవాలు వల్ల ఎక్కువగా సెల్ వినియోగమే శ్రవణ సమస్యలకు కారణంగా తెలుస్తోంది. దీంతో వైద్యులు ఏం చెబుతున్నారంటే చెవికి సెల్ 'అతికించు కోకుండా తగినంత దూరంగా ఉంచి మాట్లాడాలని హితవు' పలుకుతున్నారు.
జీడిపాకం సీరియల్ లాగ సంభాషణలు సాగదీయ కుండా క్లుప్తంగా సెల్ లో మాట్లాడాలని, ఫోన్ స్పీకర్లు, ఇయర్ ఫోన్లు వాడుకోవాలని సూచిస్తున్నారు. దానికన్నా ల్యాండ్ ఫోన్ వాడటం ఉత్తమం అంటున్నారు వైద్య నిపుణులు. సెల్ తో అదే పనిగా 'కనెక్ట్' అయితే చెవులకు 'డిఫెక్ట్' ఖాయం. గంటల కొద్దీ 'సెల్' చల్ అంటూ హల్ ఛల్ చేసే యువత, స్నేహితులు కొంచెం దూకుడు తగ్గించాలి. ఎదుట వారి కోసం కాకపోయినా... తమ 'చెవుల' రక్షణ కోసమైనా 'కాల్' జాగ్రత్తలు అందరూ తీసుకోవాలి!
Pages: -1- 2 News Posted: 11 November, 2009
|