బామ్మ బాటలో రాహుల్ ఎఐసిసిలో యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ యుఐ రెండింటి బాధ్యతలు వహిస్తున్న రాహుల్ కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు శూన్యంగా కనిపిస్తున్న నియోజకవర్గాలలో యువ అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీ అధిష్ఠాన వర్గాన్ని కోరి నిజమైన విజేతగా నిలిచారు. మే నెలలో లోక్ సభ ఎన్నికల నుంచి ఈమధ్య మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికల వరకు ఫలితాలే ఇందుకు సూచికలుగా ఉన్నాయి.
ఫిరోజాబాద్ లో రాహుల్ ప్రచారం సాగించిన తీరు మన్ననలు అందుకున్నది. ప్రచారంలో కూడా ఆయన సంప్రదాయానికి భిన్నంగానే వ్యవహరించారు. ములాయం సింగ్ యాదవ్ కోటలో ఆయనపై గాని, సమాజ్ వాది పార్టీపై గాని విమర్శలతో వోట్ల పునరేకీకరణకు రాహుల్ పూనుకోలేదు. అందుకు బదులుగా రాజ్ బబ్బర్ కు అనుకూలంగా వోట్లు వేయవలసిందిగా రాహుల్ అభ్యర్థించారు. రాజ్ బబ్బర్ ను గెలిపించినట్లయితే ఆయనను లోక్ సభలో తన పక్కనే ఆశీనుడిని చేస్తానని, వెనుకబడిన ప్రాంతం అభివృద్ధిని ఆయన సాధ్యం చేయగలరని రాహుల్ ఇచ్చిన భరోసాయే అక్కడి వోటర్లకు ప్రోత్సాహకం అయింది.
ఈ వ్యూహం ప్రభావం ముస్లింలపై ఎక్కువగా ప్రసరించిందని ప్రచారంలో పాల్గొన్నవారు చెప్పారు. ఒక వైపు 'మౌలానా' ములాయం, మరొక వైపు 'సెక్యులర్' బిఎస్ పి నిలవడంతో ముస్లింలు డోలాయమాన స్థితిని ఎదుర్కొన్నారు. రాహుల్ జోక్యంతో వారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఫలితంగా రాజ్ బబ్బర్ కు అనుకూలంగా వారి వోట్లు పడ్డాయి.
కులంతో నిమిత్తం లేకుండా అభివృద్ధి సాధించేందుకు వోటు వేయాలన్న అభ్యర్థనతోను, యువతరం ప్రతినిధిగా నిలబడడంతోను రాహుల్ సామాజిక సంక్లిష్టతలను అధిగమించగలిగినట్లు ఈ ఉప ఎన్నిక ఫలితం సూచిస్తున్నది. అయినా, బబ్బర్ పంజాబీ కావడంతో కాంగ్రెస్ పార్టీ కులాన్ని ప్రచారాస్త్రంగా ఉపయోగించజాలదు. కాని, అభివృద్ధిపై రాహుల్ దృష్టి కేంద్రీకరించడం వల్ల ఎన్నికల పోరు 'యాదవ్ కు, తక్కినవారికి మధ్య' పోటీగా మారిందని కాంగ్రెస్ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. అయితే, విజేతకు 85,353 వోట్లు ఆధిక్యం రావడం ఈ నియోజకవర్గంలో పోటీ నామమాత్రమేనన్నది సూచిస్తున్నది.
Pages: -1- 2 News Posted: 11 November, 2009
|