బిజెపిలో 'గడ్కారీ' గోల గడ్కారికి 'జాతీయ స్థాయి ప్రాభవం' లేకపోవడాన్ని భాగవత్ పట్టించుకోవడం లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 'నాయకులు జన్మించరు, తయారవుతారు' అని భాగవత్ ఆలోచనా ధోరణిని వివరించే యత్నంగా సంఘ్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. పార్టీ, ఆర్ఎస్ఎస్ మధ్య వైరుధ్యాన్ని 'దాదాపు సరిచేయలేనిది'గా బిజెపిలో మెజారిటీ వర్గం భావిస్తున్నది. ఇందుకు కారణం 'అహం కాదు' అని, కాని ప్రధాన స్రవంతి రాజకీయ నేతల నుంచి నవ తరం వోటర్లు ఆశిస్తున్న కార్యక్రమాలేనని ఆ వర్గం పేర్కొంటున్నది.
'ఆర్ఎస్ఎస్ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. అఖండ భారత్, నైతికత అంశాలపై వారి ఉద్ఘాటనపూర్వక ప్రసంగాలు యువతరానికి అర్థవంతంగా కనిపించవు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లతో ఏకీకృతం కావాలని ఇండియా ఎందుకు కోరుకుంటోందో, ఎందుకు సమస్యలను కొనితెచ్చుకోవడమో వారికి అర్థం కాదు. రాహుల్ గాంధి, మాయావతి, రాజ్ థాక్కరే వంటి కొత్త శ్రేణి నాయకులతో దీటైన రాజకీయ వ్యూహాలను బిజెపి తిరిగి రూపొందించుకోవలసి ఉంటుంది' అని బిజెపి ప్రతినిధి ఒకరు అభిప్రాయం వెలిబుచ్చారు. గడ్కారి వంటి నాయకుడు ఇటువంటి ఆశలు, ఆకాంక్షలకు తగినట్లుగా వ్యవహరించగలరా అని ఆయన ప్రశ్నించారు.
కాగా, ప్రతిపక్ష నాయకునిగా అద్వానీ నిష్క్రమణ గురించి, ఆయన వారసుని గురించి భాగవత్, రాజనాథ్ చర్చించారా లేదా అనేది ధ్రువీకరణ కాలేదు. అయితే, రాజనాథ్ తప్పుకున్న వెంటనే తాను కూడా నిష్క్రమిస్తానని భాగవత్ కు అద్వానీ 'హామీ ఇచ్చారు' అని బిజెపి వర్గాలు చెప్పాయి.
కాని భాగవత్, రాజనాథ సమావేశం 'సాధారణమైనదే' అని సంఘ్ అధికార ప్రతినిధి రామ్ మాధవ్ స్పష్టం చేశారు. ఆగస్టులో 'చింతన్ బైఠక్' (మేధో మథన సదస్సు) తరువాత రాజనాథ్ సంఘ్ అధ్యక్షుని కలుసుకోలేదని, కర్నాటక సంక్షోభంతో సహా గడచిన మూడు నెలలలోని పరిణామాలపై చర్చించాలని అనుకున్నారని రాజనాథ్ సన్నిహిత వర్గాలు వివరించాయి.
Pages: -1- 2 News Posted: 12 November, 2009
|