తూర్పుకే తుపాను తిప్పలు తీవ్ర స్థాయిలో తుపానులు ఏర్పడేందుకు బంగాళా ఖాతం అనువైన ప్రాంతమని ఆయన పేర్కొన్నారు. బంగాళాఖాతంలో తుపానుకు ఉత్తర ప్రాంతాలలో పశ్చిమ దిశగా గాలి వీచడం తుపాను ముందుకు సాగడానికి దోహదం చేస్తుందని, సముద్ర మట్టంలో అకస్మాత్ పెరుగుదల ఉంటుందని, మినీ సునామీ పరిస్థితుల సృష్టి జరుగుతుందని, భూప్రాంతం దిశగా నీటి కదలిక ఉంటుందని కృష్ణకుమార్ వివరించారు. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో సముద్ర తీరం పొడవునా గల ప్రాంతాలు సమతలంగా ఉంటాయని, పర్యవసానంగా తుపాను చొచ్చుకువచ్చినప్పుడు అవి జలమయమయ్యే, తుపాను గాలులకు నష్టానికి గురయ్యే అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ తీరంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుందని, ఎత్తైన పశ్చిమ కనుమలు సముద్ర తీరానికి బాగా సమీపంలో ఉన్నాయని, సముద్ర తీరానికి 100 కిలో మీటర్ల లోపే పర్వతాల వరుస ఉందని ఆయన చెప్పారు. 'పశ్చిమ కనుమలు గాలులకు బలమైన అడ్డుగోడలుగా ఉన్నాయి' అని కృష్ణకుమార్ చెప్పారు.
బంగాళాఖాతంలో తుపానుల వల్ల గడచిన దశాబ్దాలలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 1977లో ఆంధ్ర ప్రదేశ్ ను తుపాను తాకగా, 1999లో ఒరిస్సా తీర ప్రాంతాలలో సూపర్ సైక్లోన్ బీభత్సం సృష్టించింది. ఆ రెండు సందర్భాలలో దాదాపు పది వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, 1970 నవంబర్ లో బెంగాల్ ను, బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్తాన్)ను తాకిన భోలా తుపాను ఈ చరిత్రలోనే అత్యంత దారుణమైనది. ఆ తుపానుకు సుమారు ఐదు లక్షల మంది దుర్మరణం చెందారు.
Pages: -1- 2 News Posted: 12 November, 2009
|