ఆ భవనం ఇక భద్రం 2001 డిసెంబర్ లో తీవ్రవాదులు దాడి జరిపిన పార్లమెంట్ భవనం 'దెబ్బ తింటున్న సూచనలు' కనిపిస్తుండడం పట్ల మీరా కుమార్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం నాటి నిర్ణయం ఫలితంగా, భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థకు ప్రతీక అయిన పార్లమెంట్ భవనం విషయంలో వారసత్వ సంపద పరిరక్షణకు సంబంధించిన నిబంధనలన్నిటినీ వర్తింపజేస్తారు. పార్లమెంట్ భవనం ఒక భారీ వర్తులాకార కట్టడం. దానిలో శాసనవ్యవస్థ విభాగాలు, ఒక కేంద్ర గ్రంథాలయం కోసం మూడు అర్ధవర్తులాకార చాంబర్లు ఉన్నాయి. వాటికి పైన 27.4 మీటర్ల ఎత్తున ఒక డోమ్ ఉంది.
బ్రిటిష్ వలస పాలకుల హయాంలో నిర్మితమైన, సుమారు 800 మంది సభ్యులు ఆశీనులయ్యే, గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ ప్రారంభోత్సవం చేసిన ఆ భవనం వ్యాసం 173 మీటర్లు. అది మొత్తం 2.02 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. భవనం చుట్టూ స్తంభాలతో వరండాలు ఉన్నాయి. మూడు అర్ధవర్తులాకార మందిరాలను 'చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్', 'కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్' , విధాన సభ కోసం ఉద్దేశించారు. ఇప్పుడు వాటిలో లోక్ సభ, రాజ్యసభ, లైబ్రరీ, సెంట్రల్ హాల్ ఉన్నాయి.
నాయకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేయడమనేది పార్లమెంట్ భవనం వారసత్వ సంపద ప్రతిపత్తి పరిరక్షణకే పరిమితమైంది. దానికి మించి వారు వచ్చే గురువారం (19న) ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల అజెండాపైనే ఆందోళన వెలిబుచ్చారు. ఊర్థ్వముఖంగా సాగుతున్న ధరలు, పెచ్చుమీరుతున్న మావోయిస్టుల హింసాకాండ నేపథ్యంలో ఈ సమావేశాలు వాడిగా వేడిగా సాగవచ్చునని తాను ఊహిస్తున్నట్లు సాక్షాత్తు స్పీకర్ తెలియజేశారు. 'ఆగ్రహావేశాలతో కూడిన చర్చలతో ఉద్రిక్తపూర్వకంగా సాగే సమావేశాల కోసం మేము ఎదురుచూస్తున్నాం. అలా కాకపోతే సమావేశాలు చాలా బోర్ కొడతాయి' అని మీరా కుమార్ చెప్పారు. అయితే, సభా కార్యక్రమాలు సాఫీగా సాగేందుకు తాము సహకరించగలమని అన్ని పార్టీలూ తనకు హామీ ఇచ్చినట్లు స్పీకర్ తెలిపారు.
సమావేశాల వ్యవధి తగ్గిపోతుండడం పట్ల సభ్యులు కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా కనీసం 100 రోజులైనా పార్లమెంట్ సమావేశాలు జరిగేట్లు చూడవలసిందిగా ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ప్రభుత్వం సుముఖంగానే ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్ చెప్పారు. ఇందుకు ఒక షెడ్యూల్ ను రూపొందించవలసిందిగా రాజకీయ పార్టీలను మంత్రి కోరారు. గురువారం ఈ సమావేశానికి హాజరైన నేతలలో ప్రతిపక్షాల నుంచి ఎల్.కె. అద్వానీ, హెచ్.డి. దేవేగౌడ, అజిత్ సింగ్, సమాజ్ వాది పార్టీ నాయకుడు రేవతీ రమణ్ సింగ్, బాసుదేవ్ ఆచార్య, గురుదాస్ దాస్ గుప్తా కూడా ఉన్నారు.
Pages: -1- 2 News Posted: 13 November, 2009
|