హిజ్రాలకు 'ఒ' గుర్తింపు
'వాయిసెస్ ఎగెనిస్ట్ 377' అనే సంస్థ సభ్యురాలు నేహా సూద్ ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది 'స్వాగతించదగిన చర్య' అని సూద్ పేర్కొన్నారు. స్వలింగ సంపర్కులు (లెస్బియన్లు, గేలు), హిజ్రాలు వంటివారి హక్కుల కోసం పోరాడుతున్న ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల (ఎన్ జిఒల) సమాఖ్య ఇది.
'అయితే, ఈ సమాజం కోసం తగిన కేటగిరీని నిర్ణయించడంలో నిలకడగా వ్యవహరించవలసిన అవసరం ఉంది' అని సూద్ పేర్కొన్నారు. 'ప్రభుత్వం ఈ సమాజాన్ని సంప్రదించవలసిన అవసరం ఉంది' అని సూద్ సూచించారు. స్వలింగ సంపర్కుల మధ్య ఇష్టపూర్వక సెక్స్ సంబంధాలను అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వడానికి ముందు 'ప్రకృతి విరుద్ధమైన' సెక్స్ సంబంధాలను నేరంగా పరిగణిస్తున్న చట్టం నుంచి ఈ సమాఖ్య తన పేరును పెట్టుకుంది.
ప్రస్తుతం పాస్ పోర్టులలో పురుషుడు లేదా మహిళ లేదా హిజ్రాగా నమోదు చేయించుకునే అవకాశం ఉందని సూద్ చెప్పారు. అయితే, దాని వల్ల అంతగా ప్రయోజనం ఉండడం లేదని, అంతర్జాతీయ స్థాయిలో అటువంటి కేటగిరీని గుర్తించకపోవడం ఇందుకు కారణమని సూద్ పేర్కొన్నారు. తమిళనాడులో రేషన్ కార్డులను 'తృతీయ' జాతికి ఇస్తున్నారని సూద్ తెలిపారు.
Pages: -1- 2 News Posted: 13 November, 2009
|