భోజనం మరింత భారం
గత సంవత్సరం ప్రధానంగా పప్పు ధాన్యాలు, కూరగాయలు, చక్కెర ధరలు పెరగగా, రానున్న మాసాలలో ధరలు పెరిగే ఉత్పత్తులలో పత్తి, సోయాబీన్, వరి, నూనె గింజలే ప్రముఖ స్థానం ఆక్రమించవచ్చునని బార్ క్లేస్ కాపిటల్ సంస్థ ఒక పరిశోధన పత్రంలో సూచించింది.
అయితే, స్పెక్యులేషన్, అక్రమ నిల్వల కారణంగానే ఆహార వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. 'నిజంగా కొరత ఉండడం వల్ల కాకుండా పెద్ద ఎత్తున అక్రమంగా నిల్వ చేయడం వల్లే ఈ ధరలు పెరుగుతున్నాయి. రైతులు, వినియోగదారులు దోపిడీకి గురవుతుండగా, స్పెక్యులేటర్లు మాత్రమే లాభం పొందుతున్నారు' అని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికార ప్రతినిధి ప్రకాశ్ జావదేకర్ వ్యాఖ్యానించారు.
వర్షపాతం బాగా తక్కువగా ఉన్నప్పటికీ ఆలస్యంగా కురిసిన వర్షాల వల్ల రబీ పంటకు కావలసిన తేమ పొలాలలో ఉన్నది. రబీ పంట శీతాకాలంలో వేస్తారు కదా. ఇది ఇలా ఉండగా, ఆహార వస్తువుల ధరలు తగ్గినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సరకుల ధరలు, ముఖ్యంగా ఆయిల్ ధరలు మొత్తం మీద ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని కొనసాగించవచ్చు.
అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో వడ్డీ రేట్లు పెరగవచ్చునని గోల్డ్ మాన్ సాక్స్ వంటి పెట్టుబడి బ్యాంకులు అనేకం ఊహిస్తున్నాయి. '2010లో వడ్డీ రేట్లను 125 బేసిస్ పాయింట్ల (1.25 పర్సంటేజ్ పాయింట్ల) మేర పెంచవచ్చునని మేము ఊహిస్తున్నాం' అని సిటీగ్రూప్ ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై అక్టోబర్ 21న విడుదల చేసిన అంచనాల నివేదికలో ఇండియా గురించిన ప్రస్తావనలో తెలియజేసింది. అదే గనుక జరిగినట్లయితే, మధ్య తరగతి భారతీయుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క చందం అవుతుంది. వంటగది బడ్జెట్ ను సర్దుబాటు చేసుకోలేక, రుణాలకు సంబంధించి పెరిగిన ఇఎంఐని చెల్లించలేక వారు సతమతం అవుతారు.
Pages: -1- 2 News Posted: 15 November, 2009
|