సిగ్గా? సీక్రేటా? సలహా 'ఫ్రీ' న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ప్రస్తుతం సాగుతున్న భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (ఐఐటిఎఫ్) లో ఆరోగ్య శాఖ పెవిలియన్ వద్ద ఒక భారీ డిస్ ప్లే, సమాచార కేంద్రాన్ని జెఎస్ కె ఏర్పాటు చేసింది. ఈ నెల 19 నుంచి 27 వరకు ఇది ప్రజలకు సమాచారాన్ని అందజేస్తుంది. దేశంలోని మౌలానా అజాద్ వైద్య కళాశాల, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్), లేడీ హార్డింజ్ వైద్య కళాశాల వంటి ప్రముఖ వైద్య విద్యా సంస్థలకు చెందిన డాక్టర్ల సాయంతో రూపొందించిన ప్రశ్నోత్తరాల జాబితాలో నుంచి ఈ హెల్ప్ లైన్ కాల్ సెంటర్ ఉద్యోగులు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. ఒక ప్రైవేట్ బిపిఒ సంస్థ, ఒక గైనకాలజిస్ట్ సాయంతో సుశిక్షుతులైన ఏజెంట్లు ఈ కాల్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు.
విద్య, సమాచారం లోటు వల్లే చిన్న వయస్సులో చాలా వరకు వివాహాలు జరుగుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ చెబుతున్నది. 2005 - 2006 కాలానికి సంబంధించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్ హెచ్ఎస్) ప్రకారం, చట్టబద్ధమైన వయస్సు 18 ఏళ్ళ లోపే బాలికలు, 21 ఏళ్ళ లోపే బాలురు అధిక శాతం వివాహాలు చేసుకుంటున్నారు. ఇలా తక్కువ వయస్సులో వివాహాలు ఝార్ఖండ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో జరుగుతున్నాయి. ఝార్ఖండ్ లో 70 శాతం మంది మహిళలు,50 శాతం మంది పురుషులు, బీహార్ లో 69 శాతం మంది మహిళలు, 42 శాతం మంది పురుషులు, రాజస్థాన్ లో 63 శాతం మంది మహిళలు, 59 శాతం మంది పురుషులు ఇలా తక్కువ వయస్సులో వివాహం చేసుకుంటున్నారు. జెఎస్ కె సమాచారం ప్రకారం, దేశంలో ప్రసూతి మరణాలకు చాలావరకు టీనేజ్ గర్భాలే కారణం. దేశంలో ఏటా సుమారు 35 లక్షల మంది టీనేజర్లు గర్భం దాలుస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 16 November, 2009
|