సూర్యుణ్ణుంచే విద్యుత్ భూమిపై కన్నా రోదసిలో కనీసం ఐదింతలు బలంగా ఉండే సౌర శక్తిని సౌర విద్యుత్ ఘటాలు (సెల్స్) సమీకరించి లేజర్లు లేదా మైక్రో తరంగాల ద్వారా భూతలానికి ప్రసారం చేస్తాయి. వాటిని సముద్రంలో లేదా డామ్ రిజర్వాయర్లలో నిర్దుష్ట ప్రాంతాలలో ఏర్పాటు చేసే భారీ పరిమాణంలోని సమాంతర ఏంటెన్నాలు సేకరించగలవని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లొరేషన్ ఏజెన్సీ (జెఎఎక్స్ఎ - జక్సా) అధికార ప్రతినిధి తదాషిగె టాకియా తెలిపారు.
కిలో వాటవర్ కు ఎనిమిది యెన్ ల రేటుకు విద్యుత్ ను ఉత్పత్తి చేయగల ఒక గిగావాట్ వ్యవస్థ ఏర్పాటు పరిశోధకుల లక్ష్యం. ఇది ఒక మధ్య స్థాయి అణు విద్యుత్ కేంద్రానికి సమానమైనది. జపాన్ లో ప్రస్తుత వ్యయం కన్నా ఇది ఆరింతలు చౌక. అయితే, వివిధ పరికరాలను అంతరిక్షంలోకి చేరవేయడంతో సహా ఈ ప్రాజెక్టులో ఎదురయ్యే సవాల్ బృహత్తరమైనదే. కాని జపాన్ 1998 నుంచి ఈ ప్రాజెక్టుపై కృషి చేస్తున్నది. జక్సా పర్యవేక్షణలో సుమారు 130 మంది పరిశోధకులు దీనిపై అధ్యయనం జరుపుతున్నారు.
Pages: -1- 2 News Posted: 16 November, 2009
|