యుఐడి ప్రాజెక్ట్ లీకేజి? పేరు, జన్మ స్థలం, జన్మ తేదీ మొదలైన ప్రాథమిక సమాచారాన్ని ఐచ్ఛికంగా యుఐడిని కోరే వ్యక్తి దగ్గర నుంచి సేకరించేందుకు యుఐడిఎఐకి అధికారం ఇవ్వగలరని ప్రైవసీ అంశాన్ని ప్రస్తావిస్తూ డాక్యుమెంట్ తెలియజేసింది. సమాచారం, రికార్డులు కోరేందుకు, తనిఖీలు, విచారణలు జరిపేందుకు, కేంద్ర ఐడి డేటా రిపాజిటరీ (సిఐడిఆర్), రిజిస్ట్రార్లతో ఆడిట్ చేయించేందుకు, పేర్ల నమోదు సంస్థలు, సర్వీస్ ప్రొవైడర్ల నియామకానికి ఈ సంస్థకు హక్కు ఉంటుందని కూడా డాక్యుమెంట్ తెలియజేసింది.
ఈ శాసనంలో కొన్ని కీలక సెక్షన్ల ఉల్లంఘనకు యుఐడిఎఐ, సిఐడిఆర్, రిజిస్ట్రార్లు, పేర్ల నమోదు సంస్థలు, ఇతర సర్వీస్ ప్రొవైడర్లు నేరుగా లేదా పరోక్షంగా నియమించిన, లేదా వాటితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధాలు ఉన్న వ్యక్తులను శిక్షించేందుకు నిబంధనలు చట్టంలో ఉంటాయని డాక్యుమెంట్ పేర్కొన్నది.
'వివిధ ఆర్టిఐ అభ్యర్థనలకు స్పందించనందుకు' యుఐడిఎఐపై విమర్శలు వచ్చాయి. తన పని తీరుకు, లేదా తాను అనుసరిస్తున్న ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించాలన్న ఆర్ టిఐ చట్టం నిబంధనను యుఐడిఎఐ సంస్థ పాటించడం లేదని తాను (ఆన్ లైన్ లో) దాఖలు చేసిన ఫిర్యాదుపై కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) ప్రాథమిక విచారణను చేపట్టిందని ఒక ఆర్ టిఐ వినియోగదారుడు చెప్పినట్లు ఒక చర్చా వేదిక తెలియజేసింది. ''సిఐసి ప్రాథమిక స్థాయిలో నిర్వహించిన విచారణలో నా ఫిర్యాదు తగినదేనని తేలింది. వచ్చే వారం తన ముందు హాజరు కావలసిందిగా యుఐడిఎఐలో అత్యంత సీనియర్ అధికారిని (నందన్ నీలేకనిని కాదు) సిఐసి కోరారు. ఆ అధికారితో పాటు ప్రణాళికా సంఘం నుంచి ఒక సీనియర్ ఆఫీసర్ కూడా రావాలని సిఐసి ఆదేశించారు. యుఐడిఎఐ ఒక 'ప్రాధికార సంస్థా' లేక ప్రణాళికా సంఘానికి 'అనుబంధితమైన సంస్థా' అనే ప్రశ్న తలెత్తడం ఇందుకు కారణం' అని ఆ చర్చా వేదిక ఆ అభ్యర్థిని ఉటంకిస్తూ తెలియజేసింది.
Pages: -1- 2 News Posted: 16 November, 2009
|