'అప్పీల్'పై చార్జీల మోత ఈ ఫీజులు అత్యల్పం కావడమే కాకుండా ఇప్పటి రూపాయి విలువతో పోలిస్తే ఎందుకూ కొరగావని మొయిలీ భావించారు. ఇప్పటి రోజులకు తగినట్లుగా ఫీజుల వ్యవస్థను రూపొందించేందుకు ప్రయత్నించవలసిందిగా న్యాయ కోవిదులను మొయిలీ కోరారు. ప్రస్తుతం న్యాయవాదులు భారీ మొత్తాలు చార్జి చేస్తుండగా, కక్షిదారులు సుప్రీం కోర్టులో అప్పీలు నిమిత్తం ఢిల్లీకి రావడానికి హెచ్చు మొత్తం ఖర్చు చేస్తున్నారు.
హెచ్ సి తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఎస్ఎల్ పి దాఖలు చేయడానికి ఫీజును రూ. 5000కు పెంచాలనేది న్యాయ మంత్రిత్వశాఖకు అందిన ప్రతిపాదనలలో ఒకటి. కేవలం ఈ హెచ్చింపు వల్ల ఏటా అదనంగా రూ 25 కోట్ల వరకు ఆదాయం లభిస్తుందని ఈ ప్రతిపాదన సూచిస్తున్నది. వకాలత్ నామాకు ఫీజును, కేసులో హాజరుకు వసూలు చేసే చార్జీని తగిన విధంగా పెంచినట్లయితే, దాని ప్రభావం గణనీయంగానే ఉంటుంది. కోర్టులో మౌలిక వసతుల విస్తరణ ఖర్చులను భరించేందుకు కావలసిన నిధులు సమకూరగలవు. 'ముఖ్యంగా పసలేని, యదాలాప దావాలు దాఖలు కాకుండా చూడడానికి ఇది వీలు కల్పిస్తుంది' అని ఈ ప్రతిపాదన పేర్కొంటున్నది.
అన్ని చోట్ల, చివరకు అధిక విలువ గల కేసులలో నిర్ణయాలు వెలువరించే కస్టమ్స్, ఎక్సైజ్, అమ్మకం పన్ను అప్పిలేట్ ట్రిబ్యునళ్లలో కూడా దావాలకు ఫీజులు అత్యల్పంగా ఉంటున్నాయి. 'ఈ ఫీజులు మరీ తక్కువగా ఉన్నాయి. కేసుల విలువలో 0.01 శాతంగా ఫీజులు ఉంటున్నాయి' అని ఈ ప్రతిపాదన పేర్కొన్నది. టెలికామ్ వివాదాల పరిష్కారం, అప్పిలేట్ ట్రిబ్యునల్ (టిడిశాట్)లో సంపన్న మొబైల్ ఆపరేటర్లు సాగించే అధిక విలువ గల దావాల గురించి కూడా ఈ ప్రతిపాదన ప్రస్తావిస్తూ, దీనిలో అప్పీలు దాఖలు చేయడానికి ఫీజు తక్కువగా రూ. 5000 మాత్రమే ఎందుకు ఉందని ప్రశ్నించింది.
Pages: -1- 2 News Posted: 17 November, 2009
|