పైలట్లకూ ఇక మందు పరీక్ష 'మద్యం సేవించినట్లు పరీక్షలో వెల్లడైన లేదా విమానం నడపడానికి ముందు శ్వాస పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించే సిబ్బంది ఎవరినైనా కనీసం నాలుగు వారాల పాటు విధులకు దూరంగా ఉంచాలి... పూర్తి పరీక్ష జరిగే లోపే విమానాశ్రయం నుంచి వెళ్ళిపోవడం ద్వారా పరీక్ష ప్రక్రియను తప్పించుకోజూసే సిబ్బంది ఎవరినైనా మద్యం మత్తులో ఉన్న వ్యక్తిగా పరిగణించాలి' అని డిజిసిఎ జాయింట్ చీఫ్ ఎ.కె. చోప్రా రూపొందించిన ముసాయిదా నిబంధనావళి సూచిస్తున్నది.
ఈ కొత్త నిబందనావళిని సాధ్యమైనంత త్వరలో అమలులోకి తీసుకురావాలని డిజిసిఎ పట్టుదలగా ఉన్నది. మద్యం మత్తులో పైలట్లు విధులకు హాజరు కావడం అనేది క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సమయంలో బాగా పెరుగుతోంది. ఏదైనా అంతర్జాతీయ సర్వీసు విమానంలో ప్రయాణికులకు సరఫరా చేసే మద్యం శాంపిల్ ను సిబ్బంది రుచి చూసినట్లయితే వారిని పరీక్షించడానికి ప్రయాణికులంతా దిగిపోయిన తరువాత విమానంలోనే సిబ్బందికి శ్వాస పరీక్ష నిర్వహిస్తారు కూడా. అయితే, విమానం ఎక్కిన తరువాత కన్నా ఎక్కడానికి ముందే శ్వాస పరీక్షలు నిర్వహించడానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు.
'ఇండియా నుంచి బయలుదేరే విమానాలకు సంబంధించి కనీసం 40 శాతం మంది విమాన సిబ్బంది (పైలట్ల)కి, 20 శాతం మంది క్యాబిన్ క్రూ సభ్యులకు మద్యం సేవించారా లేదా తేల్చుకునేందుకు విమానం ఎక్కడానికి ముందే పరీక్ష జరపాలి' అని ఈ ముసాయిదా సూచిస్తున్నది. విమానం నడపడానికి కనీసం 12 గంటల ముందు సిబ్బంది మద్యం సేవించరాదు.
Pages: -1- 2 News Posted: 17 November, 2009
|