భారతీయ 'మమత' పార్టీ! సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, ఎం. వెంకయ్య నాయుడు, అనంత కుమార్ కలిసి చేసిన 'కుట్రే' రాజనాథ్ బాధ్యతల నిర్వహణను అడ్డుకున్నదని సంఘ్ అభిప్రాయపడుతున్నది. అయితే, బిజెపిలో చాలా మంది ఈ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. బిజెపిని రాజకీయంగాను, నైతికంగానూ 'మూలాలకు' తీసుకువెళ్ళడానికి రాజనాథ్ సింగ్ చేసిన ప్రయత్నానికి ఆ నలుగురూ గండి కొట్టారని సంఘ్ భావన. 'అట్టడుగు స్థాయిలో వాస్తవాల గురించి ఏమీ తెలియని ఢిల్లీ నాయకులు'గా వారిని సంఘ్ పరిగణిస్తున్నది. అయితే, ఈ అభిప్రాయం తప్పని బిజెపి వర్గాలు వాదిస్తున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా అరుణ్ జైట్లీ పలు రాష్ట్ర శాసనసభల ఎన్నికలలో, ముఖ్యంగా మధ్య ప్రదేశ్, కర్నాటక, పంజాబ్ లలో పార్టీని విజయాన్ని సాధ్యం చేయగలిగారని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు సంఘ్ కు అత్యంత ఇష్టురాలైన సుష్మా స్వరాజ్ పార్టీలో అటల్ బిహారి వాజపేయి తరువాత అధిక సంఖ్యలో జనాన్ని ఆకట్టుకునేలా ప్రసంగించగల నేర్పరి అని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, ఆ నలుగురి 'జోక్యాన్ని నిలువరించే' ప్రయత్నంగా ఆర్ఎస్ఎస్ పార్లమెంటరీ విభాగం నుంచి పార్టీ వ్యవస్థను వేరు చేయాలని యోచిస్తున్నట్లు సంఘ్ వర్గాలు తెలియజేశాయి. పార్లమెంటరీ పార్టీని తమ ఇష్టానుసారం నడుపుకునే 'స్వేచ్ఛ' ఆ నాయకులకు ఉంటుందని, కాని పార్టీ దైనందిన కార్యకలాపాల నిర్వహణలో వారు 'వేలు పెట్టరాద'ని ఆ వర్గాలు సూచించాయి.
రాజనాథ్ సింగ్ నిష్క్రమణ తరువాత జరగవచ్చునని భావిస్తున్న మార్పులకు ముందుగా బలయ్యేది ప్రధాన కార్యదర్శులందరిలోకి సీనియర్ అయిన అనంత కుమార్ కావచ్చు. కర్నాటకలో ఇటీవలి సంక్షోభంలో అనంత కుమార్ పోషించిన పాత్ర ఆర్ఎస్ఎస్ కు ఏమాత్రం నచ్చలేదని ఆ వర్గాలు చెప్పాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి బి.ఎస్. యెడ్యూరప్పను ప్రధానంగా వ్యతిరేకిస్తున్నది అనంత కుమారే. సంక్షోభం పరిష్కారం కాకుండా ఏదో ఒక కారణంతో ఆయన అడ్డుపడినట్లు భావిస్తున్నారు. అనంత కుమార్ 'ప్రేరణ'తో బళ్ళారి రెడ్డి సోదరులు యెడ్యూరప్పను మార్చవలసిందేనని పట్టుబట్టారని ఆ వర్గాలు తెలిపాయి. యెడ్యూరప్పను మార్చాలనే ప్రతిపాదనను సంఘ్ వ్యతిరేకించింది.
బిజెపికి తదుపరి అధ్యక్షుడుగా ఢిల్లీ వెలుపలి రాష్ట్రాల నాయకులలో ఒకరు బాధ్యతలు స్వీకరిస్తారని, ఆ 'నలుగురిలో' ఎవ్వరికీ ఆ అవకాశం ఉండదని స్పష్టం చేయడం ద్వారా భాగవత్ వారి వ్యూహాన్ని అడ్డుకున్నారు. 'అధికార కేంద్రం మారుతోందని బళ్ళారి సోదరులు గ్రహించారు. వారు ఆ సందేశాన్ని అందుకుని కొన్ని షరతులతో ముఖ్యమంత్రి కొనసాగడానికి అంగీకరించారు' అని ఆ వర్గాలు తెలిపాయి.
అయితే, 'ఢిల్లీ నేతలు నలుగురూ' తేలికగా పక్కకు నెట్టదగినవారు కాదనే సంకేతం పంపుతూ బిజెపి, కర్నాటక ప్రభుత్వం మధ్య వ్యవహారాలను సమన్వయ పరిచేందుకు రాజనాథ్ ఏర్పాటు చేసిన పర్యవేక్షక కమిటీలో అనంత కుమార్ ను మంగళవారం చేర్చుకున్నారు. కమిటీలోని ఇతర సభ్యులు జగదీష్ శెట్టర్, కె.ఎస్. ఈశ్వరప్ప. వారిద్దరు కూడా యెడ్యూరప్ప విమర్శకులే.
Pages: -1- 2 News Posted: 18 November, 2009
|