రామారావుకు కొత్త ఝలక్ ఈ సంవత్సరం జూన్ లో రాష్ట్ర వైద్య విద్యా శాఖ డైరెక్టర్ ఆదేశానుసారం కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సీనియర్ సర్జన్, అనస్థీషియా ప్రొఫెసర్ డాక్టర్ ఎ.ఎస్. కామేశ్వరరావు, హైదరాబాద్ లోని ఉస్మానియా వైద్య కళాశాల పేథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ కె.ఆర్.కె. ప్రసాద్ లతో కూడిన ఇద్దరు సభ్యుల బృందం ఆకస్మికంగా తనిఖీ జరపగా రాష్ట్ర ప్రభుత్వం, ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న జిఒలలో నిర్దేశించిన ప్రకారం, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయం నిబంధనావళి ప్రకారం ఆ కళాశాలలో మౌలిక వసతులు లేవని వెల్లడైంది.
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో స్పృహ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ పేరుతో కళాశాలకు సొంత ఆసుపత్రి ఉందని చెప్పడం ద్వారా రాజమండ్రిలోని ఎపి వైద్య విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రికి క్లినికల్ అనుబంధ ప్రతిపత్తిని పొందినట్లు ఆకస్మిక తనిఖీలో వెల్లడైంది. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయం నిబంధనావళికి అనుగుణంగా ఆ విద్యా సంస్థకు ఫ్యాకల్టీ లేదని కూడా ఈ తనిఖీలో వెల్లడైంది.
పైన పేర్కొన్న లోపాల దృష్ట్యా సదరు విద్యా సంస్థపై క్రమశిక్షణ చర్యను ఎందుకు తీసుకోరాదో వివరించవలసిందని కోరుతూ సంస్థకు షోకాజ్ నోటీస్ జారీ చేయవలసిందిగా ప్రభుత్వానికి వైద్య విద్యా శాఖ డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు. 15 రోజులలోగా యాజమాన్యం సమాధానం రాని పక్షంలో నిబంధనల ప్రకారం మరిన్ని చర్యలు తీసుకోగలమని ప్రభుత్వం హెచ్చరించింది.
Pages: -1- 2 News Posted: 20 November, 2009
|