గెలుపు కావాలా?కాసుల చాలువా? అయితే, మనం వేడుక జరుపుకోవడానికి కొన్ని విషయాలు ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ క్రికెట్, హైదరాబాద్ లో అమోఘంగా ఆడి అతను చేసిన 175 పరుగుల స్కోరు, అహ్మదాబాద్ టెస్ట్ లో రాహుల్ ద్రావిడ్ మహత్తర ఇన్నింగ్స్ ఈ కోవలోకి వస్తాయి. మహెలా జయవర్ధనె తన ఆరవ డబుల్ సెంచరీతో వారిని వెనుకకు నెట్టాడనుకోండి. కాని మనం భారతీయులం ఆటలో అరటి పండు కోసమే చూస్తామనుకోండి.
అందువల్ల బిసిసిఐ ప్రజా సంబంధాల (పిఆర్) యంత్రాంగం కోసం ఎందుకైనా మంచిదని ఐదు రెడీమేడ్ సాకులు ఇక్కడ ఇవ్వడమైనది.
1. శ్రీలంక వీరబాదుడు గురించి మనం మరీ విపరీతంగా బాధపడనక్కరలేదు. మనది అత్యంత సంపన్న బోర్డు అయితే ఏమిటి? కొంత కాలం క్రితం మన దగ్గర నుంచి రుణం కోసం శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్ సి) ఎదురుచూస్తే ఏమిటి? మన జట్టు దాదాపు నంబర్ వన్ అనే భావన ఉన్నప్పటికీ వారు టెస్ట్ ర్యాంకింగ్ లలో మనకన్నా ఒక మెట్టుపైనే ఉన్నారు. అందువల్ల ఇదేమీ అనూహ్యం కాదు.
2. బౌలింగ్ కోచ్ కు అర్ధంతరంగా ఉద్వాసన పలికాం. అందువల్ల దారుణంగా విఫలమైనందుకు బౌలర్లను తప్పు పట్టజాలం.
3. ఫీల్డింగ్ కోచ్ ను కూడా అర్ధంతరంగా బర్తరఫ్ చేశాం. కనుక (ఒడిఐలలో) ఫీల్డింగ్ లో కూడా విఫలమయ్యాం.
4. భారతీయ వికెట్ల నుంచి ఏం ఆశించగలరు? మన జ్ఞాపక శక్తి తక్కువ. కనుక నిరంతరాయంగా పోటీలు అడడం ద్వారా మన బౌలర్లపై విరుచుకుపడే ముందు భారతీయ వికెట్లపైనే ఒక ఏడాది క్రితం వరుస టెస్ట్ సీరీస్ లలో ఇశాంత్ శర్మ, జహీర్ ఖాన్ అత్యద్భుతంగా బౌలింగ్ చేసిన సంగతి గుర్తుంచుకోం. అయితే, మృత, 'బౌలర్ల శక్తిన హరించే' వికెట్లను సమకూరుస్తామనే విషయం అసంబద్ధమైనదే. మరి టెస్ట్ క్రికెట్ అంతరిస్తే ఏమి?
5. ఇక చివరగా, ఐపిఎల్ ప్రహసనప్రాయపు హక్కుల ద్వారా పుష్కలంగా డబ్బులు సంపాదించడానికి, జట్టు, కిట్ స్పాన్సర్లకు అసాధారణ స్థాయిలో సొమ్ముల వచ్చేటట్లు జాగ్రత్త పడటంలోనూ బిజీబిజీగా ఉంటుంచే క్రికెట్ కు, అభివృద్ధికి, వికెట్ల ప్లానింగ్ కు లేదే క్రికెట్లో మన జట్టు గెలవడానికి అవసరమైన ఇతర విషయాల గురించి ఆలోచించేందుకు సమయం ఏదీ? మాకు డబ్బు చూపండి చాలు.
Pages: -1- 2 News Posted: 20 November, 2009
|