'సూచికలు సరైన దిశలోనే సాగుతున్నాయి. మనం పురోగమిస్తున్నాం. కాని అంత వేగంగా కాదు. మనం అమలు పరుస్తున్న తీరు నాసిగా ఉంది. ఈ సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యం (ఎండిజి)లను కూడా మనం అందుకోలేకపోవచ్చు' అని ప్రణాళికా సంఘం సభ్యురాలు సయీదా హమీద్ అభిప్రాయం వెలిబుచ్చారు.
ఆర్థిక వ్యవస్థ గణనీయంగా వృద్ధి చెందినప్పటికీ దేశ జనాభాలో 40 శాతం పైగా ప్రస్తుతం రోజుకు 1.25 డాలర్ల కన్నా తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. 128 మిలియన్ల మంది ప్రజలకు మెరుగైన మంచినీటి వనరులు అందుబాటులో లేవు. 665 మిలియన్ల మంది ప్రజలు బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేస్తున్నారు. దేశంలో పది కోట్ల మంది చిన్నారుల పేర్లు కనీసం ప్రాథమిక పాఠశాలల్లో కూడా నమోదు కావడం లేదు. సుమారు 15 కోట్ల మంది చిన్నారులు బాల కార్మికులుగా పనిచేస్తున్నారని కారిన్ హల్షాఫ్ వివరించారు.