ఊపిరాడని 'గాలి' అదే సమయంలో కర్నాటక కాంగ్రెస్ కూడా అక్కడి బిజెపి మంత్రి గాలి జనార్దన్‌రెడ్డిని లక్ష్యంగా పెట్టుకుని యడ్యూరప్ప సర్కారుకు ఊపిరాడకుండా చేస్తోంది. అక్కడ కాంగ్రెస్ కూడా ఇక్కడ ప్రతిపక్షం మాదిరిగానే సర్కారుపై ఒత్తిడి తెచ్చి ఓఎంసి సంగతి తేల్చాలన్న వ్యూహం అనుసరిస్తున్నారు. ఓఎంసి అక్రమాలపై అక్కడి కాంగ్రెస్ నేతలు ఏకంగా పుస్తకాలనే ప్రచురించారు. కర్నాటకలో తమ సర్కారు రాకుండా గాలి అడ్డుపడ్డాడని, కర్నాటకలో కాంగ్రెస్‌ను సమాధి చేస్తానని శపథం చేశారంటూ గతంలో గాలి చేసిన సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు తమకు వ చ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీలో అక్రమ తవ్వకాలు నిజమేనంటూ సుప్రీంకోర్టు నియమించిన సాధికారిక కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో, ప్రస్తుతం ఓఎంసికి కేటాయించిన ప్రాంతంలో జరుగుతున్న ఐరన్ ఓర్ తవ్వకాలను విశాఖ స్టీల్‌కు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. సంబంధం లేకపొయినా ఓఎంసికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కోవడం కన్నా, దాని లీజు రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ స్టీల్‌కు కేటాయించడం మంచిదని కొందరు ఉన్నతాధికారులు రోశయ్యకు సూచించిన మీదట ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.విశాఖ స్టీల్ ప్రభుత్వ రంగ సంస్థ అయినందున దానికి లీజు ఇస్తే విపక్షాల నుంచి కూడా ఎలాంటి విమర్శలు వచ్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి వద్ద వాదించనున్నారు. ఓఎంసిపై మెతక వైఖరి అవలంబిస్తున్నారంటూ విపక్షాల విమర్శలకు గురవుతున్న రోశయ్యకు.. తన చిత్తశుద్ధిని చాటుకునేందుకు విశాఖ స్టీల్‌కు లీజు అప్పగించడమే సబబని విహెచ్ బృందం సూచించనుంది.
Pages: -1- 2 News Posted: 21 November, 2009
|