చైనీయుల 'పవర్' దెబ్బ 'వివిధ విద్యుత్ ప్రాజెక్టు స్థలాలలో బిజినెస్ వీసాలతో పని చేస్తున్న 3000 మందికి పైగా చైనీస్ ఇంజనీర్లు, సెమీ-స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ను తిరిగి పంపివేశారు' అని విద్యుత్ మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలియజేశారు. 'మొత్తం శ్రామిక శక్తిలో ఒక శాతం లేదా 20 మంది ప్రొఫెషనల్స్ కన్నా తక్కువ ఉండాలంటూ విధించిన పరిమితి అత్యల్పంగా కనిపిస్తున్నది' అని బ్రహ్మ కార్మిక శాఖ కార్యదర్శి ప్రభాత్ సి. చతుర్వేదికి రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. 'పురోగమించిన దశలో ఉన్న ప్రాజెక్టులకు మినహాయింపు ఇవ్వవలసిందిగా మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను' అని బ్రహ్మ తన లేఖలో పేర్కొన్నారు.
'ఎవరైనా విదేశీ జాతీయుని ఇండియాలో ఉద్యోగంలో నియమించినట్లయితే అతనికి సరైన వీసా (పూర్తి ఉపాధి వీసా) ఉండాలి' అని హోమ్ శాఖ కార్యదర్శి జి.కె. పిళ్ళై స్పష్టం చేశారు. చైనీస్ సంస్థల ద్వారా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన ప్రైవేట్ సంస్థల నుంచి తమకు విజ్ఞప్తులు అందినట్లు కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సిఇఎ) చైర్మన్ రాకేష్ నాథ్ తెలియజేశారు. వీటిలో వి.ఎస్. లిగ్నైట్ పవర్, వార్ధా పవర్, అదానీ పవర్, సిఎల్ పి పవర్, కెఎస్ కె ఉన్నాయని ఆయన తెలిపారు.
Pages: -1- 2 News Posted: 23 November, 2009
|