దొంగలకు ఇష్టం 'మారుతి' కాగా, దేశంలో అత్యధిక సంఖ్యలో వాహనాలు ఉన్న నగరం ఢిల్లీలో పర్యావరణ అనుకూల కార్లకు కొనుగోలుదారులను చూడడం కష్టంగా ఉంది. ఎలక్ట్రిక్ కారు రేవాకు ఇంతవరకు ఒక ఏడాది పైచిలుకు కాలంలో 150 మంది కొనుగోలుదారులే వచ్చారు. ఈ కారు ఖరీదులో దాదాపు మూడింట ఒక వంతు మేర ఢిల్లీ పర్యావరణ శాఖ సబ్సిడీ ఇస్తున్నా, కొనుగోలుదారులకు ఇతర పన్నులను వాపసు చేస్తున్నా ఈ పరిస్థితి నెలకొనడం గమనార్హం. ఇది ఇలా ఉండగా, డీజెల్, పెట్రోల్ లతో నడిచే వ్యక్తిగత వాహనాల వల్ల ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఏడేళ్ళ క్రితపు స్థాయికి తిరిగి చేరుకున్నది. ఏడేళ్ళ క్రితం 'పరిశుద్ధమైన ఇంధనం' కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సిఎన్ జి)ని నగరంలో ప్రభుత్వ రవాణా సంస్థ వాహనాల కోసం ప్రవేశపెట్టారు. 'ఈ కారు కొనాలని అభిలషించే ప్రభుత్వ రంగ సంస్థలకు సబ్సిడీ సదుపాయం ఉంది.ఈ సబ్సిడీని ప్రైవేట్ సంస్థలకు కూడా వర్తింపజేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది' అని రేవా ఇండియా మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ పవన్ సచ్ దేవా అభిప్రాయం వెలిబుచ్చారు.
'సబ్సిడీ ఒక్కటే సరిపోదు. ఢిల్లీలో పబ్లిక్ కారు చార్జింగ్ కేంద్రాలు చాలా ఉండాలి. ఆ సౌకర్యం లేకపోతే ఎలక్ట్రిక్ కారు అమ్మకాలు పెరగడం ఎప్పుడూ కష్టమే' అని స్వచ్చంద సంస్థ 'సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్స్ రైట్ టు క్లీన్ ఎయిర్ క్యాంపెయిన్' అధిపతి అనుమిత రాయ్ చౌధురి అన్నారు. ప్రభుత్వ రవాణా సంస్థ వాహనాలకు సిఎన్ జిని తప్పనిసరిగా వాడాలనే విధానాన్ని ఏడేళ్ళ క్రితం అమలు జరిపినప్పుడు వాహనాలను సిఎన్ జితో నడిచేవిగా మార్చడంతో పాటే నగరమంతటా తగినన్ని సిఎన్ జి ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేట్లు ప్రభుత్వం చూడవలసి ఉంటుందని సుప్రీం కోర్టు ఆదేశించింది.
Pages: -1- 2 News Posted: 23 November, 2009
|