సిబల్ మార్కులెన్నో మరి? ఐఐటి కౌన్సిల్ సమావేశానంతరం సిబల్ చేసిన ఈ వ్యాఖ్యలు కొందరు విద్యార్థులు, టీచర్లు, రాజకీయ నాయకులు ఆగ్రహంతో ఆయనపై విరుచుకుపడడానికి దారి తీశాయి. ఐఐటి ప్రవేశ పరీక్షలలో అర్హత కటాఫ్ ను పెంచడం 'ఉన్నత వర్గాలను' ప్రోత్సహించినట్లు కాగలదని, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల ప్రయోజనాలకు హాని కలిగించగలదని వాదిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హెచ్ఆర్ డి శాఖ మంత్రి సిబల్ కు ఒక లేఖ రాశారు. తాను ఒక ఉదాహరణగా మాత్రమే 80 శాతం మార్కులని పేర్కొన్నానని, అర్హత ప్రాతిపదికను నిర్ణయించే అధికారం హెచ్ఆర్ డి మంత్రిత్వశాఖకు కాకుండా ఐఐటిలకే ఉందని సిబల్ ఆ వెంటనే వివరించారు.
తన విద్యార్హతల విషయంలో దాచుకోవలసింది ఏదీ మంత్రికి లేదని, కాని ఆర్ టిఐ దరఖాస్తు ఒక్క సిబల్ విషయంలోనే కాకుండా ఐఐటి డైరెక్టర్లు, ఫ్యాకల్టీ విషయంలో కూడా పన లేనిదని, అసమంజసమైనదని సిబల్ సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానించాయి. 'హెచ్ఆర్ డి మంత్రి వ్యాఖ్యలను ఆయన వివరణతో నిమిత్తం లేకుండా పరిగణనలోకి తీసుకున్నప్పటికీ అసమంజసమైన అభిప్రాయాలు కలిగించడానికి ఆర్ టిఐ ప్రశ్న దారి తీస్తున్నది' అని అధికారి ఒకరు అన్నారు.
సిబల్, ప్రస్తుత ఐఐటి డైరెక్టర్లు, పలువురు ఫ్యాకల్టీ సభ్యులు తమ స్కూలు చదువును పూర్తి చేసిన 1960, 1970 దశకాలలో చాలా స్కూల్ బోర్డులలో మార్కులు సంపాదించడం ఇప్పటి కన్నా చాలా కష్టంగా ఉండేదని ఆ అధికారి పేర్కొన్నారు. వివిధ బోర్డులలో విద్యార్థుల ప్రతిభను పోల్చేందుకు బోర్డులకు వీలు కల్పించే పర్సెంటైల్ విధానం ఏదీ లేనందున ఆర్ టిఐ దరఖాస్తుదారు 'అనుచిత' అభిప్రాయాలకు రావచ్చునని మరొక అధికారి అన్నారు. ఆర్ టిఐ దరఖాస్తులో కోరిన సమాచారం ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత ఉద్యోగాలకు కావలసిన అర్హతలకు సంబంధించినది కాదనే కారణంపై కూడా దానిని తిరస్కరించవచ్చు. సమాచారం వెల్లడి చేయడం ఆర్ టిఐ చట్టం కింద రక్షణ లభిస్తున్న ప్రైవసీకి భంగం కలిగించినట్లు కాగలదు.
Pages: -1- 2 News Posted: 23 November, 2009
|