'గూగుల్' గల్లంతు! ఈ గూగుల్ గ్రామం కథ ఈ నాటిది కాదు. పన్నెండవ శతాబ్ధంలో యోగి, కవి అల్లమ ప్రభు బసవకళ్యాణం నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళుతున్నప్పుడు ఈ గ్రామస్తులు ఆయనను ఆపారు. ఆయన నివసించిన గుహను 'గవిగల్లు'(రాళ్ళ గుహ) అనే వారు. అప్పటి నుంచి ఊరి పేరు గవిగల్లు అయిందని, కాలక్రమేణా దానిని గవిగల్లు కాస్తా గూగుల్ గా మారిందని అక్కడి వారు చెబుతున్నారు. దానికి నిదర్శనంగా గుహ లోపలి భాగంలో ఉన్న ఆలయాన్ని చూపిస్తారు. అక్కడ అల్లమ ప్రభు విగ్రహం, చిన్న నుయ్యి ఉంటుంది. దానిని దర్శించుకోడానికి చిన్న దారి నుంచి భక్తులు పాకుకుంటూ వెళతారు. ఇది వాస్తవానికి కాస్త దగ్గరగా ఉన్న స్థల పురాణం.
కానీ ఊరూరా కథలు చెప్పుకునే సాతానులు మాత్రం తమ చరిత్ర చెప్పుకుంటూ తమ గ్రామంలో రాళ్ళు సంగీతం వినిపిస్తాయని చెబుతారు. అందుకే తమ గ్రమానికి 'కూగువ కల్లు'(నీటి ప్రవాహం తాకిడికి వినసొంపైన శబ్ధాలను వినిపించే రాళ్ళు) అనే పేరు ఉండేదని రచయిత చిదానంద సాలి వివరించారు. అయితే అక్కడి వాగు నీళ్ళు ఎలాంటి శబ్ధం చేయవని, దూరంగా ఉన్న తమవారికి గ్రామస్థులే లయబద్దమైన కూతలు వేసేవారని చరిత్ర పరిశోధకుడు ఎస్ కె అరుణ్ వివరించారు. అలానే దూరంగా ఉన్నవారికి సంకేతాలు పంపడానికి పెద్ద రాళ్లను చిన్న రాళ్లతో లయబద్ధంగా కొడతారని, దాంతో వాటిపై కప్పులాంటి గుంటలు పడ్డాయని వివరించారు. ఇలాంటి గుంటలు ఉన్న రాళ్ళు కృష్ణాతీరంలో ఉన్న వాత్కల్, హునసాగి, హెబ్బల్ బర్జ్ వంటి గుల్బర్గా, రాయ్ చూర్ జిల్లా గ్రమాల్లో కనిపించాయని ఆయన తెలిపారు. ఆ రాళ్లు ఉన్నందునే ఆ గ్రామానికి 'కూగువ కల్లు' పేరు వచ్చి ఉండవచ్చని, అది ఇప్పుడు 'గూగుల్'గా మారిందని ఆయన విశ్లేషించారు.
Pages: -1- 2 News Posted: 27 November, 2009
|