9 మందికి 36 వేల బుల్లెట్లు! తీవ్రవాదులు దాడికి తెగబడ్డారని తెలిసిన తరువాత ముంబయి పోలీసులకు అధికారులు ఐదు వేల పాత బుల్లెట్లు ఇచ్చి యుద్ధానికి పంపేశారు. ఎన్ ఎస్ జి రంగంలోకి దిగిన తరువాత మరో 21 వేలకు పైగా బుల్లెట్లను ఆయుధాగారం నుంచి తీసి ఇచ్చారు. నేవీ కమెండోలు కాల్చినవి, పోలీసుల వద్ద అప్పటికే ఉన్నవి మొత్తం కలిపి 36 వేల బుల్లెట్లు కాల్చారని తేలింది.
ఎకె 47 ఆయుధాలతో తెగబడిన తీవ్రవాదులు మొత్తం 10,500 బుల్లెట్లు తెచ్చుకున్నారు. వాటితోనే 166 మందిని కాల్చి చంపారు. మరో 300 మందిని గాయపరిచారు. తీవ్రవాదులు తమ తుపాకులను ప్రజల గుండెల మీదికి లేదా మర్మాంగాల మీదకే సూటిగా కాల్చారు. అసలు పోరాటం మొదలు పెట్టిన పది గంటల వరకూ ముంబయి పోలీసులు దాడిని అయోమయంగానే సాగించారు. ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియకుండా గుడ్డిగా వ్యవహరించారని తేలింది.
ఇప్పుడు ముంబయి పోలీసులకు మత్తు వదిలింది. ఆ దాడి తరువాత తుపాకులను పేల్చడంలో శిక్షణ తీసుకుంటున్నారు. దీని కోసం ఈ సంవత్సర కాలంలో వారు లక్షా 20 వేల బుల్లెట్లను వాడారు. అయితే తుపాకులు మాత్రం బ్రిటీషు కాలం నాటివే కావడమే వింత.
Pages: -1- 2 News Posted: 27 November, 2009
|