'మ్యూజిగల్' ఆరంభం
http://telugupeople.com/uploads/tphome/images/2009/sirivennela.gif' align='left' alt=''>
మ్యూజిగల్ సంస్థ సీఈఓ ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ 'భారతీయ సంగీతంలోని అన్ని రకాల సంగీత ప్రక్రియలకు (సినీ సంగీతం, లలిత సంగీతం, జాన పదం, శాస్త్రీయ సంగీత, భక్తి సంగీతం) ఇంటర్ నెట్ మాధ్యమంలో ఏకైక సంగీత ప్రధాన పోర్టల్ మ్యూజిగల్.కాం (www.muzigle.com) లో అన్ని భారతీయ భాషల సంగీతం ఉచితంగా వినవచ్చని చెప్పారు. అంతేకాకుండా నిర్ణీత రుసుము ద్వారా డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చని తెలిపారు. మ్యూజిగల్ ద్వారా భారత దేశంలోని సంగీతం పట్ల అభిరుచి, నైపుణ్యం, ఉత్సాహం, అంకిత భావం ఉన్న సంగీత కళాకారులు, రచయితలు, సంగీత నిర్దేశకులు, గాయకులు, వాద్య కళాకారులను ప్రపంచ సంగీత అభిమానులకు దగ్గర చేయడమే మ్యూజిగల్ ధ్యేయమన్నారు. ఔత్సాహిక కళాకారుల సంగీతానికి సరైన ఆర్ధిక వనరులు చేకూర్చడం కూడా మ్యూజిగల్ ఆశయాలలో ఒకటని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత అభిమానులకు,ఔత్సాహిక భారతీయ సంగీత కళాకారులకు ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ఎల్లలు చెరిపేసి వారి సంగీతానికి ప్రాచుర్యం కలిగించడం మ్యూజిగల్ లక్ష్యం' అని వివరించారు.
మ్యూజిగల్ సంస్థ ఛైర్మన్ షాన్ అప్పజోడు మాట్లాడుతూ 'ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ సంగీత అభిమానులకు, సంగీత కళాకారులకి మధ్య బంధాన్ని ధృడ పరిచే అన్ని ఆధునిక టెక్నికల్ సపోర్ట్ ను మ్యూజిగల్ అందిస్తుందని వివరించారు. మ్యూజిగల్.కాంలో సంగీత అభిమానుల కోసం అనేక సదుపాయాలు అందించడం జరిగింది. సంగీత అభిమానులు వారికి ఇష్టమైన కళాకారుల, సినిమాల, సంగీత దర్శకుల ఆల్బంస్, సంగీతం, పాటలు, సుస్పష్టంగా, చక్కటి క్వాలిటీతో (256 KBPS Bit Rate లో) వినొచ్చు, డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు తమ ప్రొఫైల్ పేజ్ ద్వారా ప్రపంచంలోని మరింత మంది సంగీత అభిమానులతో అనుసంధానం కావచ్చు. సోషల్ నెట్ వర్స్క్ అయిన ఆర్కుట్, ఫేస్ బుక్, మై స్పేస్ వంటి సోషల్ నెట్ వర్కుల ద్వారా మీకిష్టమైన సంగీతాన్ని, మీ ప్రతిభని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్నేహితులతో పంచుకోవచ్చు. ప్రతి యూజర్ తమకిష్టమైన ప్లే లిస్ట్ తయారు చేసుకోవడమే కాకుండా.తామే పాడిన కరోకే పాటల వీడియోలను స్నేహితులతో పంచుకొనే సదుపాయం అందిస్తోంది మ్యూజిగల్.
మ్యూజిక్ కంపెనీలు ఈ డిజిటల్ యుగంలో కేవలం సీడీలు, క్యాసెట్లు, అమ్మకం మీద ఆధారపడలేవు. అందుకే, మ్యూజిగల్ అందిస్తోంది డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ విధానం. మ్యూజిగల్ ద్వారా ఆయా కంపెనీలు తమ సంగీతం ఆల్బంస్ ని మ్యూజిగల్ ద్వారా అమ్మకానికి ఉండవచ్చు. ప్రతీ ఆల్బం కు ఒక మైక్రో సెట్ ద్వారా ప్రాచుర్యం కల్పించవచ్చు. ప్రపంచ మ్యూజిగల్.కాం లక్ష్యాలుగా ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
Pages: -1- 2 News Posted: 30 November, 2009
|