అడవుల్ని పెంచిన నక్సల్స్! కాగా, గిరిజనులు అత్యధిక సంఖ్యలో గల అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలలో కూడా అటవీ ప్రాంతాలు తగ్గాయి. సాగు ప్రాంతాలలో ఇతోధిక మార్పు ఇందుకు కారణం. ప్రస్తుత ప్రాంతాలలోల ఉత్పత్తి పడిపోయిన తరువాత సేద్యం కోసం కొత్త అటవీ ప్రాంతాలను ఎంచుకోవడం గిరిజనుల పద్ధతి. 'జీవ వైవిధ్యంపై వామపక్ష తీవ్రవాదం ప్రభావం ఉందో లేదో మాకు తెలియదు' అని జైరామ్ రమేష్ చెప్పారు. 'ఈ విషయాన్ని మేము నిర్థారంచుకోవలసిన అవసరం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లోని నాగార్జున పులుల అభయారణ్యంపై అధ్యయనం జరపవచ్చు' అని ఆయన సూచించారు. బ్రెజిల్, యుఎస్ లలో వలె ఇండియాలో అటవీ ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ ఉండదు.
భారతదేశంలో భౌగోళిక ప్రాంతంలో 33.64 శాతం మేర గిరిజన జిల్లాలు ఉన్నాయి. కాని దేశంలోని మొత్తం అటవీ ప్రాంతాలలో 59.72 శాతం ఆ జిల్లాలలోనే ఉన్నాయి. ఏడున్నర కోట్ల మంది గిరిజనులు తమ జీవనోపాధికి అడవులపైనే ఆధారపడుతుంటారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి 2007లో షెడ్యూల్డ్ తెగలు, ఇతర సాంప్రదాయక అటవీ వాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది.
రాష్ట్రాలు అక్టోబర్ వరకు 5.68 లక్షల భూమి పట్టాలు పంపిణీచేశాయని, ఇంకా 24.90 లక్షల క్లెయిములు పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వం సోమవారం పార్లమెంట్ కు తెలియజేసింది. నక్సల్ బాధిత ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు గిరిజనులకు భూముల పంపిణీలో 'విశిష్ట కృషి' చేశాయని కూడా ప్రభుత్వం తెలియజేసింది.ల్స్!
Pages: -1- 2 News Posted: 1 December, 2009
|