కేంబ్రిడ్జికి మమత! ఇదే కనుక జరిగినట్లయితే. మమతకు రైల్వే శాఖ మంత్రిగా ఇదే తొలి విదేశీ పర్యటన. ఈ పర్యటనకు ఏ తేదీలనూ ఇంకా ఖరారు చేయనప్పటికీ, జనవరి చివరి వారంలో ఆమె పర్యటించవచ్చునని అధికారులు సూచించారు. కాగా, మమత నుంచి గాని, ఆమె కార్యాలయం నుంచి గాని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి ఎటువంటి సమాచారమూ లేదు. ఆమెకు నిర్దుష్టంగా ఇంకా ఏ ఆహ్వానమూ అందకపోయినప్పటికీ, విశ్వవిద్యాలయం ప్రతినిధి ఒకరు 'ది టెలిగ్రాఫ్' విలేఖరితో మాట్లాడుతూ, 'ఈ విషయమై కొన్ని నెలల క్రితం మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి. కాని ఈ సమావేశానికి నిర్దుష్టంగా ఇంకా ఏర్పాట్లూ ఏవీ చేయలేదు. ప్రపంచ ఖ్యాతి పొందిన విశ్వవిద్యాలయంగా మేము ప్రపంచమంతటి నుంచి సందర్శకులకు స్వాగతం పలుకుతుంటాం' అని తెలిపారు.
మమత కోరుకున్నట్లయితే కేంబ్రిడ్జి పర్యటన గురించి డేమ్ సాండ్రాతోను, విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ ఎలిసన్ రిచర్డ్ తోను వ్యక్తిగతంగా చర్చించవచ్చు. వారిద్దరూ జనవరి ప్రారంభంలో కోలకతా, ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాలను సందర్శించనున్నారు.
Pages: -1- 2 News Posted: 4 December, 2009
|