ఎవరెస్ట్ పై కేబినెట్ మీటింగ్ హిమాలయాలలోని హిమ నదాలు ఆందోళనకర స్థాయిలో కరిగిపోతున్నాయని, కట్టలతో సరస్సులను సృష్టిస్తున్నాయని, అవి బద్దలై దిగువన ఉన్న గ్రామాలను ముంచెత్తవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. కరిగే మంచు వల్ల పర్వతారోహకులకు మార్గాలు నిలకడగా సాగేందుకు అవరోధం కలుగుతుందని వారంటున్నారు.
పకడ్బందీ ప్రణాళికతో మంత్రులను సురక్షితంగా పర్వతంపైకి తీసుకువెళ్ళారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నకు పక్కనే 5250 మీటర్ల ఎత్తులో ఒక సమతల ప్రదేశం కాలాపత్థర్ ను చేరుకునేందుకు హెలికాప్టర్లు ఎక్కే ముందు ప్రధానిని, ఇద్దరు ఉప ప్రధానులను, 20 మంది క్యాబినెట్ మంత్రులను వైద్యులు పరీక్షించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని ఆకాంక్షించే పర్వతారోహకులు ముందుగా ఈ బేస్ క్యాంప్ ను చేరుకుంటారు.
మందమైన జాకెట్లు, గాలి చొరని దుస్తులు, ఉన్ని టోపీలు ధరించిన ఈ రాజకీయ నాయకులు అందరికీ రక్తంలో తగిన స్థాయిలో ఆక్సిజన్ ఉందని, వారికి తక్షణం ముంచుకువచ్చే ప్రమాదం ఏమీ లేదని హిమాలయన్ రక్షణ సంస్థకు చెందిన బిక్రమ్ న్యూపేన్ చెప్పారు. మంత్రులలో హిమాలయాల ఎత్తుకు అలవాటు పడని వారు ఎవరైనా ఉంటే వారికి ఎక్కువ ఎత్తులో అస్వస్థత కలగకుండా నివారించడానికి గాను ఎండ ఉన్న రోజు జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం 20 నిమిషాలు మాత్రమే గడిపింది. పలువురు మంత్రుల బరువు బాగా ఎక్కువ. కొందరు 70 ఏళ్ళు పైబడినవారు. చాలా మంది దక్షిణాన పల్లపు మైదాన ప్రాంతాల నుంచి వచ్చారు. కాగా, ఆరోగ్య కారణాలపై ఈ సమావేశావికి హాజరు కావడానికి నలుగురు మంత్రులు నిరాకరించారు.
Pages: -1- 2 News Posted: 5 December, 2009
|