తెర వెనుక... మేధావులే? 'ఉద్యమానికి (ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మద్దతుదారులైన మేధావుల నుంచి) చాటుగా మద్దతు లభిస్తున్నదనేది సుస్పష్టం. ఉద్యమంలో పాల్గొనవలసిందిగా తమ విద్యార్థులను ప్రొఫెసర్లందరూ ప్రోత్సహిస్తున్నారు. అలా జరుగుతుండకపోతే ఉద్యమం ఇంత తీవ్ర రూపు దాల్చి ఉండేది కాదు. ఉద్యమ సారథులు విద్యార్థులేననే భావన తొలగిపోరాదని మేధావులు కోరుకుంటున్నారు' అని విశ్లేషకుడు ఒకరు పేర్కొన్నారు.
అదీ కాకుండా ఏ ఆందోళనలోనైనా విద్యార్థులతో కలసి సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొనడం అరుదని, కాని విద్యార్థుల ఉద్యమాన్ని వారు వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంటారని పరిశీలకులు అంటున్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మెలో సీనియర్ డాక్టర్ల పాత్ర మనకు కనిపించదని, కాని జూనియర్లు ఎందుకు సమ్మె చేస్తున్నారో ఆ కారణానికి సీనియర్ల మద్దతు తప్పకుండా ఉంటుందని పరిశీలకుడు ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.
అయినప్పటికీ, కొన్ని వ్యక్తిగత కారణాలతోనే తాము పాల్గొనడం లేదని తెలంగాణ సీనియర్ నాయకులు చెబుతున్నారు. వారివి రాజకీయ నిర్ణయాలేనని పరిశీలకుల అభిప్రాయం సరైనదే. 'గద్దర్ వంటి ప్రముఖ నాయకులు విద్యార్థులను కలుసుకుంటే, రాజకీయ రంగు పులుముకుంటుంది. అది వారికి ఇష్టం లేదు' అని ఒక ప్రొఫెసర్ అన్నారు. సమాజంలో అన్ని వర్గాలకు, ముఖ్యంగా బలహీన వర్గాలకు మాట చెల్లుబడి అయ్యే 'ప్రజాస్వామ్య' తెలంగాణ (ఏర్పడినట్లయితే)యే ఆ మేధావుల ధ్యేయమని విశ్లేషకులు చెబుతున్నారు.
'ప్రస్తుత ఉద్యమానికి దూరంగా ఉంటున్నవారు విద్యార్థుల ఉద్యమంలో తాము పాల్గొనరాదని భావిస్తున్నారు. తమ సొంత రాజకీయ అజెండాను ముందుకు తీసుకువచ్చి ప్రస్తుత ఉద్యమానికి ఆ రంగు పులమడం వారి అభిమతం కాదు. తాము ఉన్నా, లేకపోయినా ప్రస్తుత ఉద్యమం కొనసాగుతుందని వారికి కూడా తెలుసు' అని తెలంగాణ మద్దతుదారుడు, ఒయు జాగ్రఫీ శాఖ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ ఎస్. సింహాద్రి చెప్పారు.
Pages: -1- 2 News Posted: 7 December, 2009
|