మావోయిస్టు మలేరియా! పర్వత ప్రాంతాలలో పోరు సాగించడంలో నిపుణులుగా పేరు గడించిన నాగాలాండ్ సాయుధ పోలీసు జవాన్లను డిసెంబర్ 2న అసెంబ్లీ ఎన్నికల రెండవ దశలో తమర్, బుండు నియోజకవర్గాలలో నియోగించారు. ఈ రెండు నియోజకవర్గాలు మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్నవే. ప్రస్తుతం ఝార్ఖండ్ లో సుమారు వెయ్యి మంది ఎన్ఎపి జవాన్లు ఉన్నారు.
ఝార్ఖండ్ లో ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపు ఇచ్చినప్పటికీ, పోలింగ్ ను అడ్డుకోవడానికి వారు ప్రయత్నించినప్పటికీ మొదటి రెండు దశల ఎన్నికలు మొత్తంమీద ప్రశాంతంగా సాగిపోయాయంటే అందుకు పారా మిలిటరీ బలగాలే ఉనికి కారణం. నిషిద్ధ మావోయిస్ట్ సంస్థ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్ జిఎ) గురువారం కొన్ని ఇతర రాష్ట్రాలలో తమ తొమ్మిదవ వార్షికోత్సవం జరుపుకున్నది. కాని అది ఝార్ఖండ్ లో అటువంటి వేడుక ఏదీ జరుపుకోలేదు. కాగా, ఝార్ఖండ్ రాష్ట్రంలో అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య సమస్య మలేరియానే. దీని వల్ల ఏటా వందలాది మంది ప్రాణాలు కోల్పోతుంటారు. డుమ్కాలో అనేక మంది పిల్లలు మలేరియాతో బాధ పడుతున్నట్లు సమాచారం.
Pages: -1- 2 News Posted: 7 December, 2009
|