రాజుకున్న 'నిప్పు' మొదటి తెలంగాణ ఉద్యమం 1969లో మొదలై రెండేళ్లపాటు నడిచి 1971 విషాదాంతంగా ముగిసింది. దానికి వ్యతిరేకంగా 1972-73లో జై ఆంధ్ర ఉద్యమం ఒక ఊపుతో సాగి చప్పపడిపోయింది. తెలంగాణ తాజా ఉద్యమం ఉధృతమై హింసాత్మక రూపం దాల్చి చివరకు ఒక ఆశావహ ప్రకటనతో ముగిసింది. ఇది చిన్న రాష్ట్రాల ఏర్పాటు సిద్ధాంతానికి కొత్త ఊపిరిలు పోసింది. తెలంగాణతో పాటు ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక రాయలసీమ, స్వయంప్రతిపత్తి హైదరాబాద్ డిమాండ్ పెరిగే సూచనలే ఉన్నాయి. దీనితో పాటు ప్రత్యేక ఉత్తరాంధ్ర డిమాండ్ కూడా తెరపైకి తెచ్చేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. ప్రత్యేక రాయలసీమ స్థానంలో గ్రేటర్ రాయలసీమ అనే కొత్త ప్రతిపాదనా వినిపిస్తోంది. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలతో ఉండే రాయలసీమలో 52 అసెంబ్లీ సీట్లు, ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దీనిలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాను, ప్రకాశం జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నది కొత్త వాదం.
ప్రస్తుతం ఈ రెండు జిల్లాలు శ్రీకాకుళం వరకూ వ్యాపించి ఉన్న కోస్తాఆంధ్రలో భాగంగా ఉన్నాయి. వెనుకబడిన ప్రాంతం ప్రాతిపదికనే రాష్ట్రాన్ని విభజించడం అంటూ జరిగితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో ఉత్తరాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అక్కడిర వారు ఎప్పటినుంచో కోరుతున్నారు. అప్పుడు మిగిలేవి గుంటూరు, కృష్ణ, తూర్పు, పశ్చిమగోదావరి నాలుగు జిల్లాలు. అయినా 123 అసెంబ్లీ స్థానాలతో, 17 ఎంపీ స్థానలతో బలమైన ప్రాంతంగానే ఉంటుంది. అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉన్న ఈ జిల్లాల్లో కోటి మందికి పైగా జనాభా ఉంది. ఇప్పుడు సమైక్యాంధ్ర నినాదాన్ని ముందుకు తెస్తున్నారు. మొత్తానికి రాబోయే కాలం వేర్పాటు వాదనలతో రాష్ట్రం అట్టుడిగిపోవడం ఖాయంలాగే కనిపిస్తోంద.
Pages: -1- 2 News Posted: 10 December, 2009
|