'టి' మైనస్ హైదరాబాద్! దీనికి తోడు గురువారం పారిశ్రామిక వర్గాలకు చెందిన పలువురు ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిశారు. తెలంగాణా ఏర్పాటు ప్రకటనపై వారు సైతం తమ ఆందోళన వెలిబుచ్చినట్లు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తెలిపారు. ప్రస్తుతం విద్యార్ధుల పేరిట నడుస్తున్న తెలంగాణా ఉద్యమం వెనుక మావోయిస్టుల ఉన్నారని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు ధృవీకరించినందున తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే అది పూర్తిగా మావోస్టుల చెప్పు చేతల్లోకి పోయే ప్రమాదం ఉందని పారిశ్రామిక వర్గాలకు చెందిన ప్రతినిధులు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. చత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణాలో సైతం మావోయిస్టుల ప్రాబల్యం పెరిగిపోయి అది అరాచకానికి దారి తీస్తుందని భయాందోళనలను వ్యక్తం చేశారు.
ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాలలో వేల, లక్షల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసిన పరిశ్రమలకు ఈ పరిణామాలు చేటు కలిగిస్తాయన వారు చెప్పినట్లు తెలిసింది. కాంగ్రెస్ నాయకులతో సమావేశమైన పారిశ్రామిక వర్గాల ప్రతినిధులతో దేశంలో సంపన్న పరిశ్రమలతోపాటు బహుళజాతి సంస్థలు కూడా ఉన్నాయి. ఇటు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజా ప్రతినిధులతో అటు పారిశ్రామిక వర్గాలు సైతం గొంత కలపడంతో తెలంగాణా ఏర్పాటు అంటూ చేస్తే అది మైనస్ హైదరాబాద్ గా మాత్రమే జరగాలన్న వాదనకు కాంగ్రెస్ పార్టీ క్రమంగా తలవంచుతున్నట్లు తెలిసింది.
Pages: -1- 2 News Posted: 10 December, 2009
|