బెడిసికొట్టిన బాబు వ్యూహం
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి 'అనవసరంగా, తొందరపాటుతో' వ్యవహరించారని గురువారం మధ్యాహ్నం ఆరోపణల వర్షం కురిపిస్తూ చంద్రబాబు తన భావోద్వేగాలను అణచుకోలేకపోయినప్పుడు ఆయన తెలంగాణ అనుకూల వైఖరి ఎటువంటిదో తేలిపోయింది. అందరి అభిప్రాయాలను కేంద్రం తీసుకుని ఉండవలసిందని ఆయన అన్నారు. తన పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉందని బాహాటంగా ప్రకటించిన తరువాత ప్రజాభిప్రాయాన్ని కోరాలనడం సబబేనా అని ప్రశ్నించినప్పుడు చంద్రబాబు మాటల కోసం తడుముకున్నారు. కాంగ్రెస్ ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఉహించలేదని మాత్రమే ఆయన సమాధానం ఇచ్చారు. 'ఇది రాజకీయ వెలితిని సృష్టించింది. కాంగ్రెస్ మొత్తం వ్యవహారాన్ని అస్తవ్యస్తం చేసింది' అని ఆయన ఆరోపించారు. 'ఆంధ్ర ప్రదేశ్ ప్రతిష్ఠను కూడా ఆ పార్టీ దిగజార్చింది' అని చంద్రబాబు విమర్శించారు.
అయితే, ఆయన అంతకు మించి ఏమీ మాట్లాడలేకపోయారు. సరైన మార్గదర్శక సూత్రాలను లేదా పద్ధతులను అనుసరించకుండా కేంద్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించిందని ఆయన అన్నారు. రానున్న తరం భవిష్యత్తును అది గందరగోళంలోకి నెట్టిందని చంద్రబాబు ఆరోపించారు.
Pages: -1- 2 News Posted: 11 December, 2009
|