మరో ఎస్సార్సీపై యోచన
తెలంగాణపై ప్రకటనకు ఇంత 'తీవ్ర స్థాయిలో విపరిణామాలు' ఎదురవుతాయని తాము ఊహించలేదని కాంగ్రెస్ నాయకులు విడిగా అంగీకరిస్తున్నారు. నిరాహార దీక్ష సాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు (కెసిఆర్) ఆరోగ్యం క్షీణిస్తున్న స్థితిలో అది విషమ రూపు దాల్చకుండా నివారించడానికి మాత్రమే కేంద్రం ఆ నిర్ణయం తీసుకున్నదని వారు వాదిస్తున్నారు.
తాము తీసుకున్న 'రక్షణాత్మక చర్య' చిన్న రాష్ట్రాలను కోరుతున్నవారు దాడి చేయడానికి దారి తీస్తున్నదని అధికార పార్టీ అకస్మాత్తుగా గ్రహించింది. డార్జిలింగ్ లో గూర్ఖాలాండ్ ఆందోళనకారులు హఠాత్తుగా రంగంలోకి దూకారు. మాయావతి రాజకీయంగా సాహసించి చేసిన ప్రకటన కూడా రెండవ ఎస్ఆర్ సి ఏర్పాటుపై ఆలోచించేలా కేంద్రాన్ని పురికొల్పింది.
అయితే, రెండవ ఎస్ఆర్ సిపై ఇంకా లాంఛనంగా నిర్ణయమేదీ తీసుకోలేదని, మాయావతి ప్రకటన 'రాజకీయ జోక్' తప్ప మరేమీ కాదని కొందరు నాయకులు పేర్కొంటున్నారు. కాని నిరంకుశంగా నిర్ణయాలు తీసుకొనే బదులు ఈ డిమాండ్లపై అధ్యయనం చేయడానికి సంస్థాగత యంత్రాంగం ఒకదానిని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి ఉంటుందని వారు అంగీకరించారు. 'అసాధారణ పరిస్థితిలో తెలంగాణపై ప్రకటన చేయవలసి వచ్చింది. ప్రతి నిర్ణయాన్నీ కాంగ్రెస్ కోర్ కమిటీ తీసుకోజాలదు. రెండవ ఎస్సార్సీ గురించి పరిశీలిస్తున్నాం' అని మంత్రి ఒకరు చెప్పారు.
కాగా, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పటి పరిస్థితి ఉందని పార్టీలో ఒక వర్గం నాయకులు భావిస్తున్నారు. 'అధిష్ఠానాన్ని ఎవరో తప్పుదోవ పట్టించారు. అర్ధరాత్రి ఆ తప్పిదం చేసే ముందు మేము అమిత జాగ్రత్తతో వ్యవహరించి ఉండవలసింది. కెసిఆర్ ను తెలంగాణ పితను చేస్తూ, అటువంటి ఇతర కోర్కెలకు తిరిగి ఊపిరి పోసే బదులు ఆ సమయంలో రెండవ ఎస్సార్సీ గురించి పార్టీ ప్రకటన చేసి ఉండవలసింది' అని ఎఐసిసి నాయకుడు ఒకరు అన్నారు. ఆ అర్ధరాత్రి ప్రకటనను 'రాజకీయంగా అనైతిక చర్య'గా పలువురు నాయకులు భావిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 12 December, 2009
|