సోనియా దూరాలోచన?
మరొకవైపు వేర్పాటును వ్యతిరేకిస్తున్న కోస్తా ప్రాంత నాయకులు కూడా ప్రస్తుత పరిస్థితికి టిడిపిని తప్పు పడుతున్నారు. ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇవ్వగలమని టిడిపి లోగడ చెప్పి ఉండకపోయినట్లయితే కాంగ్రెస్ ఇటువంటి ప్రకటన చేసి ఉండేది కాదని వారు వాదిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు నాయుడు అనుసరించిన వైఖరి వారికి రుచించకపోవచ్చు.
ఇక కోస్తా ప్రాంతానికి సంబంధించినంత వరకు, చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ మద్దతు లభించగలదని సోనియా ధీమాగా ఉన్నారు. టిఆర్ఎస్ వలె పిఆర్పీ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనానికి సుముఖంగా ఉండవచ్చు. అంతేకాకుండా, రాష్ట్రాన్ని విభజించడం వల్ల వైఎస్ఆర్ వారసుడు జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని చేయగలరని ఇప్పటికీ ఆశిస్తున్న కాంగ్రెస్ లోని ఒక వర్గంవారిని కూడా నోరు మెదపకుండా చేయవచ్చునని సోనియా భావిస్తున్నారు. అయితే, ఇందుకు సరైన సమయాన్ని ఎంచుకోకపోవడమే ఆమె చేసిన తప్పు. అర్ధరాత్రి సమయంలో ఆమె ప్రత్యేక రాష్ట్రం గురించి ప్రకటించారు. తాను ఏమి చేయాలనుకుంటున్నదీ సొంత పార్టీ వారికి ఆమె తెలియజేయలేదు.
ఒకటి రెండు నెలల్లో రాష్ట్ర విభజన జరుగుతుందనే భావన కలగడంతో రాజీనామాలు, బంద్ ల రూపంలో స్పందనలు రాసాగాయి. అయితే, అలా జరిగే అవకాశం లేదు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సమయం తీసుకుని 2014 ఎన్నికలకు కొద్ది ముందుగా ఆ పని జరిపించవచ్చు. అప్పటి వరకు ఉన్న సమయాన్ని కమిషన్ల ఏర్పాటుకు, కోస్తా, రాయలసీమ వాసుల సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవచ్చు.
అయితే, ఆమె ఆశిస్తున్నట్లుగా ఈ ప్లాన్ పనిచేస్తుందా అనేది ఎవరైనా ఊహించుకోవచ్చు.
Pages: -1- 2 News Posted: 12 December, 2009
|