పట్టుపట్టిన రాహుల్
రాష్ట్రాలలో పాతుకుపోయిన నేతలు తమ మద్దతుదారులకు యువజన కాంగ్రెస్ లో లేదా ఎన్ఎస్ యుఐలో పదవులు ఇప్పించడంలో విఫలురైన ఉదంతాలను పార్టీ వర్గాలు ఉటంకించాయి. రాహుల్ నిశితంగా పర్యవేక్షిస్తున్న ఎన్నికల ప్రక్రియ ద్వారా కొత్త తరం నాయకులు వచ్చారని ఆ వర్గాలు తెలిపాయి.
రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు ధనబలంతో, కండబలంతో ఎన్నికలలో తప్పుడు పద్ధతులు ఉపయోగించి ముఖ్యమైన పదవులు చేజిక్కించుకున్నారని ఫిర్యాదులు వచ్చినప్పటికీ, ప్రజాస్వామిక ప్రక్రియ పునరుద్ధరణ పట్ల పార్టీ మొత్తం మీద సంతృప్తి చెందింది. అయితే, అటువంటి అక్రమాలకు తావులేకుండా చూసేందుకు సభ్యత్వ ప్రక్రియలో సంస్కరణలు తీసుకువచ్చినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. గతంలో 'బోగస్' సభ్యులను చేర్పించేందుకు నాయకులు సొంత డబ్బులు చెల్లిస్తుండేవారు. సాధారణంగా వోటర్ల జాబితాలలో నుంచి పేర్లను కాపీ చేస్తుంటారు. బోగస్ అయిన లేదా సిసలైన ప్రాథమిక సభ్యులు 25 మందిని చేర్పించగలిగే ఏ వ్యక్తి అయినా పార్టీలో క్రియాశీలక సభ్యుడు అవుతుండేవారు. ఇప్పుడు ప్రతి సభ్యుడు తన ఫోటో ఇచ్చి, సంతకం చేయవలసి ఉంటుంది లేదా వేలిముద్ర వేయవలసి ఉంటుంది. తన సభ్యత్వ రిజిస్టర్ ను కంప్యూటరీకరించాలని కూడా పార్టీ యోచిస్తున్నది.
పార్టీ సభ్యుల సంఖ్య దీని వల్ల విపరీతంగా తగ్గిపోవచ్చునని, కాని పేర్ల నమోదు సమయంలో క్షుణ్ణంగా పరిశీలను జరపడం, శిక్షణ ఇవ్వడం ముఖ్యమని పార్టీలోని వృద్ధ నాయకులు సూచిస్తున్నారు. 'ప్రతి ఒక్కరినీ కాంగ్రెస్ సభ్యుని కానివ్వరాదు' అని ఎఐసిసి వృద్ధ ఆఫీస్ బేరర్ ఒకరు కోరుతూ, గాంధీజీ సమయంలో జరిగిన ఒక ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
'బారాబంకిలో ఒక ఘరానా కాంట్రాక్టర్ కాంగ్రెస్ సభ్యుడైన విషయం గాంధీజీ దృష్టికి వచ్చింది. జిల్లా అధ్యక్షునికి లేఖ రాయవలసిందిగా నెహ్రూను ఆయన కోరారు. నెహ్రూ వెంటనే కథా కమామీషు ఏమిటని అడుగుతా ఒక పోస్ట్ కార్డ్ పంపారు. జిల్లా అధ్యక్షుడు దానిని ఖాతరు చేయలేదు. ఈ విషయమై తదుపరి చర్య తీసుకోవలసిందిగా నెహ్రూపై గాంధీజీ ఒత్తిడి తీసుకువచ్చారు. చివరకు కాంట్రాక్టరును పార్టీలో నుంచి తొలగించారు' అని ఆ నాయకుడు తెలియజేశారు.
Pages: -1- 2 News Posted: 14 December, 2009
|